rajiv gandhi stadium
-
ప్రపంచకప్‌కు ఉప్పల్ స్టేడియం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం అన్ని విధాలా సిద్ధమైందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. హెచ్‌సీఏ పర్యవేక్షకుడు, ఏకసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ కె. దుర్గాప్రసాద్ వరల్డ్ కప్‌కు సంబంధించి ఏర్పాట్ల గురించి వెల్లడించారు. బీసీసీఐ ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో స్టేడియంలో కొత్తగా అనేక అభివృద్ధి చేపట్టినట్లు ఆయన వివరించారు. ‘స్టేడియంలో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా చక్కటి అవుట్ ఫీల్డ్‌ను సిద్ధం చేశాం. ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాలను ఎంతో మెరుగుపర్చాం. వారి కోసం స్టేడియంలో మూడు వైపులా నార్త్, సౌత్, ఈస్ట్లలో కనోపీలను ఏర్పాటు చేశాం. సౌత్‌లో కొన్నాళ్ల క్రితం పాడైపోయిన కనోపీని పునరుద్ధరించాం. పాతవాటి స్థానంలో కొత్తగా ఫ్లడ్లైట్లను కూడా ఏర్పాటు చేశాం. ఎల్ఈడీ లైట్లు ఉండటం ఈసారి ప్రత్యేకత’ అని దుర్గా ప్రసాద్ చెప్పారు. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా, 11 వేలు పాత సీట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఉండటంతో ఎలాంటి సమస్యా లేదని, వాటిని సమర్థంగా నిర్వహించగలమని విశ్వాసం వ్యక్తం చేసిన దుర్గాప్రసాద్... అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌లపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 10 తేదీల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఉన్నాయి. -
India vs Australia 3rd T20: సిరీస్ ‘భాగ్యం' ఎవరిదో!
సాక్షి, హైదరాబాద్: అగ్రశ్రేణి జట్లు భారత్, ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ క్లైమాక్స్‌కు చేరింది. పరుగుల వరద పారిన తొలి పోరులో ఆసీస్ పైచేయి సాధించగా, ఎనిమిది ఓవర్ల తర్వాతి మ్యాచ్‌లో భారత్ ఫటాఫట్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సొంతగడ్డపై మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ భావిస్తుండగా, టి20 వరల్డ్ కప్ ఆతిథ్య జట్టు సిరీస్ నెగ్గి స్వదేశం చేరాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం సమరం మరింత ఆసక్తికరంగా మారింది. భాగ్యనగరంలో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. హైదరాబాద్ పిచ్ అన్ని విధాలా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది కాబట్టి పరుగుల వరద ఖాయం. 2019 డిసెంబర్ 6న రాజీవ్‌గాంధీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరిసారిగా జరిగిన అంతర్జాతీయ టి20లో మొత్తం 416 పరుగులు నమోదయ్యాయి. మళ్లీ భువనేశ్వర్... ఎనిమిది ఓవర్లకే పరిమితమైన గత మ్యాచ్‌లో భారత్ పూర్తి బలాబలాలు పరీక్షించలేకపోయింది. బ్యాటింగ్‌ను పటిష్టం చేసేందుకు పేసర్ భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి పంత్‌ను తీసుకున్నా అతనికి బ్యాటింగ్ అవకాశమే రాలేదు. అయితే గరిష్టంగా ఒక బౌలర్ రెండు ఓవర్లే వేయడంతో ఐదో బౌలర్ విషయంలో సమస్య రాలేదు. కానీ పూర్తి స్థాయి మ్యాచ్‌లో అలా సాధ్యం కాదు కాబట్టి భువ నేశ్వర్ మళ్లీ జట్టులోకి రావడం ఖాయం. బుమ్రా తన స్థాయికి తగినట్లుగా అద్భుతంగా బౌలింగ్ చేయడం సానుకూలాంశం కాగా, మ్యాచ్ మ్యాచ్ కూ మెరుగవుతున్న అక్షర్ పటేల్ మరో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అయితే వరల్డ్‌కప్‌కు ముందు హర్షల్ పటేల్, చహల్ బౌలింగ్ భారత్‌ను ఆందోళన పెడుతోంది. చహల్ వికెట్లు తీయలేకపోగా, హర్షల్ ధారాళంగా పరుగులిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల లోనూ విఫలమైన హర్షల్‌కు మరో అవకాశం ఇస్తారా లేక దీపక్ చహర్‌తో ప్రయత్నిస్తారా చూడాలి. బ్యాటింగ్‌కు సంబంధించి భారత్ మెరుగైన స్థితి లో ఉంది. నాగపూర్‌లో రోహిత్ ఆడిన షాట్లు చూస్తే అతను ఎంత ప్రమాదకర బ్యాటరో తెలుస్తుంది. రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ రాణించడం కీలకం. హార్దిక్ బ్యాటింగ్ మెరుపులు తొలి టి20లో కనిపించగా... కార్తీక్ మరోసారి తన ఫిని షర్ పాత్రకు గత మ్యాచ్‌లో న్యాయం చేకూర్చాడు. బౌలింగ్ సమస్యలు... పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఫించ్ ఫామ్‌లోకి రాగా, వేడ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన మ్యాక్స్‌వెల్ గాడిలో పడాలి. టిమ్ డేవిడ్ కూడా ధాటిగా ఆడితే ఆ జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. రెండో టి20లో ఒక అదనపు బౌలర్ కోసం బ్యాటర్‌ను తగ్గించిన ఆసీస్ మళ్లీ బ్యాటర్ వైపు మొగ్గు చూపితే ఇన్‌గ్లిస్ జట్టులోకి వస్తాడు. బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కంగారూలకు ఇబ్బందికరంగా మారింది. ఇద్దరు టాప్ బౌలర్లలో హాజల్‌వుడ్ ఫర్వాలేదనిపించినా, కమిన్స్ ఘోరంగా విఫలమవుతున్నాడు. కమి న్స్ భారీగా పరుగులిస్తున్నా ఎలిస్, రిచర్డ్సన్ గాయపడి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆడించక తప్పడం లేదు. లెగ్ స్పిన్నర్ జంపా పదునైన బౌలింగ్ కంగారూలకు అదనపు బలం. అబాట్, స్యామ్స్లలో ఒకరికే చోటు జట్టులో చోటు ఉంటుంది. కొన్ని చినుకులు... వాతావరణ శాఖ అంచనా ప్రకారం హైదరాబాద్‌లో ఆదివారం మ్యాచ్‌కు ఇబ్బంది లేకుండా సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి. శనివారంలాగే ఆకాశం మేఘావృతమై ఉంటూ అప్పుడప్పుడు స్వల్ప చినుకులు కురిసినా ఆటకు అంతరాయం ఉండకపోవచ్చు. -
కనిష్టం రూ.300... గరిష్టం రూ.7 వేలు
ఉప్పల్: భారత్, శ్రీలంకల మధ్య 9న రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మ్యాచ్ సందర్భంగా అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ప్రేక్షకుల కోసం నేటి నుంచి (బుధవారం) టికెట్ల విక్రయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధర కనిష్టంగా రూ.300...గరిష్టంగా రూ. 7 వేలుగా ఉండనుంది. జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియంలో విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేశారు. టికెట్లను అన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బుక్‌మైషో.కామ్ వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ టిక్కెట్లు కొనుక్కోవచ్చు. హైదరాబాద్ రంజీ క్రికెటర్లకు, హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లకు 240 సీట్లతో ప్రత్యేక బ్లాక్‌ను ఈ సారి అందుబాటులోకి తెచ్చారు. అలాగే హైదరాబాద్ తరఫున వివిధ వయో విభాగాల్లో ఆడిన ఆటగాళ్లకు కూడా మరో బ్లాక్‌ను కేటాయించారు. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎం కేసీఆర్ రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందుబాటులో 34 వేల సీట్లు స్టేడియం మొత్తం సీట్ల సామర్థ్యం 34,185. ఇందులో 9 వేల టికెట్లను కాంప్లిమెంటరీగా ఇస్తారు. 54 కార్పొరేట్ బాక్సుల్లో 1080 సీట్లున్నాయి. స్పెషల్ ఎన్‌క్లోజర్ టికెట్ల ధర రూ.7వేలు. ఇవి ఇరు జట్ల డ్రెస్సింగ్ రూమ్‌లకు దగ్గరగా... పెవిలియన్‌కు అటు, ఇటు 80 చొప్పున 160 సీట్లుంటాయి. మిగతా టికెట్ల విషయానికొస్తే... సౌత్ ఈస్ట్ గ్రౌండ్‌ఫ్లోర్ రూ.3వేలు, సౌత్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్, నార్త్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్ రూ.2 వేలు, నార్త్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ రూ.1500, సౌత్ టై రూ.750, నార్త్ టై, వెస్టర్న్ చైర్స్ గ్రౌండ్ ఫ్లోర్ రూ.500, వెస్టర్న్ చైర్స్ ఫస్ట్ ఫ్లోర్, ఈస్టర్న్ చైర్స్ గ్రౌండ్ ఫ్లోర్, ఈస్టర్న్ చైర్స్ ఫస్ట్ ఫ్లోర్ టికెట్లకు రూ.300 ధరగా నిర్ణయించారు. భారీ బందోబస్తు ఈ మ్యాచ్‌కు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అభిమానులెవరూ తమవెంట తినుబండారాలు, వాటర్ బాటిల్స్, సెల్ఫోన్లు, బ్యాగ్‌లు, కెమెరాలను తీసుకురావద్దని అర్షద్ అయూబ్ సూచించారు. -
నేటి నుంచి చాంపియన్స్ లీగ్ యాక్షన్
-
ఈ ఒక్కటైనా గెలుస్తారా!
నేడు బెంగళూరుతో హైదరాబాద్ పోరు - ప్రత్యర్థి దూకుడును అడ్డుకునేనా! - ఓడితే కథ ముగిసినట్లే సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై వరుసగా ఓడటం గతంలో డెక్కన్ చార్జర్స్‌కు అలవాటుగా ఉండేది. తొలి సీజన్లో అన్ని మ్యాచ్‌లు ఓడిన ఆ జట్టు ఆ తర్వాత చాన్నాళ్లకు తొలి విజయం నమోదు చేసింది. ఇప్పుడు సన్‌రైజర్స్‌గా మారిన హైదరాబాద్ జట్టు ఈ సారి అదే తరహాలో పరాజయాల బాట పట్టింది. ఉప్పల్‌లోని ఆడిన మూడు మ్యాచ్‌లూ ఓడి అభిమానులను తీవ్రంగా నిరాశ పరచింది. సీజన్లో ఇక్కడ మిగిలిన ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తారా అనేది చూడాలి. పటిష్టమైన బెంగళూరును ఓడిస్తే ఫ్యాన్స్‌కు సంతృప్తి దక్కవచ్చు. ఐపీఎల్లో గత మ్యాచ్ పరాజయంనుంచి కోలుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న హైదరాబాద్, ఈ మ్యాచ్‌లో ఓడితే ఈ ఏడాది లీగ్‌లో ముందంజ వేసే అవకాశానికి తెర పడినట్లే. మరో వైపు రైజర్స్‌ను ఓడిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు ఉండటంతో ఆర్సీబీ గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పేలవ ప్రదర్శన ఐపీఎల్-7లో ఆరంభంనుంచి కూడా ఏ ఒక్క మ్యాచ్‌లోనూ హైదరాబాద్ జట్టు తనదైన ముద్ర వేయలేకపోయింది. బ్యాటింగ్‌లో జట్టు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రెండు సార్లు భారీ స్కోర్లు నమోదు చేసినా అవి పరాజయానికే పనికొచ్చాయి. వ్యక్తిగతంగా చూస్తే డేవిడ్ వార్నర్ ఒక్కడే టి20 తరహా క్రికెట్ ఆడుతున్నాడు. 4 అర్ధ సెంచరీలు సహా అతను 375 పరుగులు చేశాడు. ఫించ్ రెండు హాఫ్ సెంచరీలు చేసినా ఆ రెండు సార్లూ టీమ్ ఓడింది. స్యామీ కూడా ఒక్క మెరుపు ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక భారత క్రికెటర్లు మాత్రం ఒక్కటీ చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా ఇవ్వలేకపోతున్నారు. కెప్టెన్సీనుంచి తప్పించినా గత మ్యాచ్‌లో ధావన్ బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. బౌలింగ్‌లో భువనేశ్వర్ మెరుగ్గా ఉన్నా...చివరి ఓవర్లలో అతనూ తేలిపోతున్నాడు. జట్టు బలమైన స్టెయిన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడం రైజర్స్ కష్టాలు పెంచింది. వ్యక్తిగతంగా, జట్టుగా రైజర్స్ సర్వ శక్తులూ ఒడ్డి అసాధారణ ప్రదర్శన కనబరిస్తేనే విజయావకాశాలు ఉన్నాయి. టాపార్డర్ కీలకం చెన్నైతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గెలుపుతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు కాపాడుకుంది. గత మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లు గేల్, డివిలియర్స్ చక్కటి ఇన్నింగ్స్ ఆడి గెలిపించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కోహ్లి మంచి ఫామ్‌లో లేకపోయినా...యువరాజ్ కూడా నిలదొక్కుకోవడంతో చాలెంజర్స్ పటిష్టంగా కనిపిస్తోంది. వీరందరూ సమష్టిగా రాణిస్తే బెంగళూరుకు భారీ స్కోరుకు అవకాశాలున్నాయి. బౌలింగ్‌లో స్టార్క్, ఆరోన్ మెరుగ్గా రాణిస్తున్నారు. భారత దేశవాళీ క్రికెటర్లలో ఈ సారి చక్కటి గుర్తింపు తెచ్చుకున్న లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మరో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. -
సన్‌రైజర్స్‌కు వరుసగా మూడో పరాజయం
-
హైదరాబాద్ ‘హ్యాట్రిక్’
సన్‌రైజర్స్‌కు వరుసగా మూడో పరాజయం ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం 7 వికెట్లతో కోల్‌కతా విజయం రాణించిన ఉమేశ్, ఉతప్ప, యూసుఫ్ పఠాన్ గత సీజన్లో సొంతగడ్డపై నిలకడగా రాణించిన సన్‌రైజర్స్‌కు ఈసారి ఉప్పల్ స్టేడియం అచ్చి రావడంలేదు. సమష్టి వైఫల్యంతో హైదరాబాద్ జట్టు ఈ మైదానంలో పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. తొలుత బ్యాట్స్‌మెన్ రాణించకపోగా, ఆ తర్వాత బౌలర్లూ ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా ఏడో పరాజయంతో సన్‌రైజర్స్ జట్టు అవకాశాలు అస్తమించినట్లే! మరోవైపు గంభీర్ సేన మాత్రం తాజా విజయంతో ప్లే ఆఫ్‌కు మరింత చేరువైంది. సాక్షి, హైదరాబాద్ ఐపీఎల్-7లో ప్లే ఆఫ్ చేరాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరేలా లేవు. జట్టు ఖాతాలో మరో ఓటమి చేరడం రైజర్స్ అవకాశాలను దెబ్బ తీసింది. ఆదివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), యూసుఫ్ పఠాన్ (28 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీష్ పాండే (32 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఉమేశ్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. వార్నర్ ఒక్కడే... సన్‌రైజర్స్‌కు ఈసారి శుభారంభం లభించలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఫించ్ (8) వెనుదిరగ్గా... ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) కూడా తొందరగానే అవుటయ్యాడు. పవర్ ప్లేలో జట్టు 2 వికెట్లకు 41 పరుగులు చేయగలిగింది. 9 పరుగుల వద్ద ఉతప్ప స్టంప్ మిస్ చేయడంతో బతికిపోయిన నమన్ ఓజా (24 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ (14) పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు వార్నర్ మాత్రం దూకుడు ప్రదర్శించాడు. తనదైన శైలిలో భారీ సిక్సర్లతో పాటు కొన్ని చక్కటి షాట్లు కొట్టాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఉమేశ్ బౌలింగ్‌లో వార్నర్ వెనుదిరగడంతో స్కోరు వేగం మందగించింది. చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (19 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు) కొంత ప్రయత్నించినా పెద్దగా పరుగులు రాలేదు. స్యామీ (16 బంతుల్లో 7) బంతులు వృథా చేయగా, చివరి 5 ఓవర్లలో సన్ 33 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమష్టి ప్రదర్శన... కోల్‌కతా కూడా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. స్టెయిన్ వేసిన రెండో ఓవర్లో అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో గంభీర్ (6) వెనుదిరిగాడు. రైజర్స్ చక్కటి బౌలింగ్, మెరుగైన ఫీల్డింగ్‌తో ఒత్తిడి పెంచడంతో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డ నైట్ రైడర్స్ పవర్ ప్లేలో కేవలం 30 పరుగులే చేయగలిగింది. అయితే మనీశ్ పాండే అండతో ఉతప్ప ధాటిగా ఆడాడు. 9 పరుగుల వద్ద ధావన్ కష్టసాధ్యమైన క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతను, ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అనవసరపు పరుగులు ప్రయత్నించి రనౌట్ కావడంలో ఉతప్ప ఇన్నింగ్స్ ముగిసింది. పాండే కూడా చెలరేగి మిశ్రా వేసిన ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు రాబట్టాడు. కొద్దిసేపటికే స్యామీ క్యాచ్ వదిలేసినా తర్వాతి బంతికే అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఈ దశలో యూసుఫ్ పఠాన్ చాలా కాలం తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడగా... చివర్లో టెన్ డస్కటే (15 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి బ్యాటింగ్‌తో నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించాడు. భువనేశ్వర్ వేసిన 18, 20 ఓవర్లలో కలిపి 27 పరుగులు రాబట్టడంతో ఆ జట్టు విజయం సులువైంది. గౌతముని ఆగ్రహం... మైదానంలో అనుచిత ప్రదర్శనతో వివాదాల్లో నిలిచిన గంభీర్ కొన్నాళ్లుగా నియంత్రణలోనే ఉంటున్నాడు. కానీ ఆదివారం మ్యాచ్‌లో అతని కోపం పాత గంభీర్‌ను గుర్తుకు తెచ్చింది. స్టెయిన్ బౌలింగ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని ఒకే పరుగు చేసి అసహనంతో ఉన్న గౌతీ, ఆ ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్నాడు. వికెట్‌కు దూరంగా వెళుతున్న బంతిని ఆడే ప్రయత్నం చేశాడు. అతని బ్యాట్‌కు బాల్ తగలకపోయినా స్వింగ్‌తో బంతి తన దిశ మార్చుకున్నట్లు కనిపించింది. దాంతో అంపైర్ గంభీర్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అంతే... అక్కడే బూతు పురాణం అందుకున్న గౌతమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. డగౌట్ చేరే వరకు తిట్టుకుంటూనే వచ్చిన అతను బౌండరీ లైన్ బయటినుంచే బ్యాట్, గ్లవ్స్ విసిరేశాడు. కీలక మ్యాచ్‌లో ఇలా అవుట్ కావడంతో అతను పట్టరాని కోపం ప్రదర్శించాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) మోర్కెల్ (బి) ఉమేశ్ 8; ధావన్ (సి) గంభీర్ (బి) నరైన్ 19; నమన్ ఓజా (సి) యూసుఫ్ (బి) షకీబ్ 22; వార్నర్ (సి) యూసుఫ్ (బి) ఉమేశ్ 34; రాహుల్ (ఎల్బీ) (బి) చావ్లా 14; ఇర్ఫాన్ పఠాన్ (నాటౌట్) 23; స్యామీ (సి) పాండే (బి) షకీబ్ 7; కరణ్ శర్మ (రనౌట్) 4; స్టెయిన్ (బి) ఉమేశ్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-14; 2-41; 3-64; 4-98; 5-104; 6-129; 7-139; 8-142. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-39-0; ఉమేశ్ యాదవ్ 4-0-26-3; నరైన్ 4-0-21-1; షకీబ్ 3-0-22-2; డస్కటే 1-0-8-0; చావ్లా 4-0-24-1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (రనౌట్) 40; గంభీర్ (సి) ఓజా (బి) స్టెయిన్ 6; పాండే (సి) ఫించ్ (బి) కరణ్ 35; యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 39; డస్కటే (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-8; 2-59; 3-104. బౌలింగ్: భువనేశ్వర్ 3.4-0-37-0; స్టెయిన్ 4-0-24-1; కరణ్ శర్మ 4-0-19-1; స్యామీ 1-0-7-0; మిశ్రా 4-0-38-0; ఇర్ఫాన్ 3-0-20-0. కెప్టెన్‌గా స్యామీ... ఐపీఎల్లో పది మ్యాచ్‌లు ఆడిన తర్వాత సన్‌రైజర్స్ జట్టు నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించింది. ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్ కావడంతో హైదరాబాద్ అప్పట్లో మరో మాటకు తావు లేకుండా శిఖర్ ధావన్‌కే కెప్టెన్సీ అప్పగించింది. అయితే టోర్నీలో ఏ దశలోనూ శిఖర్ నాయకుడిగా తన ముద్ర చూపించలేకపోయాడు. పైగా కీలక సమయాల్లో అనేక చెత్త, ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకొని తన వైఫల్యాన్ని బయటపెట్టాడు. దాంతో వెస్టిండీస్ జాతీయ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీని ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా నియమించారు. గత ఏడాది కూడా సంగక్కర కెప్టెన్‌గా టోర్నీని ఆరంభించిన ఈ జట్టు సగం ముగిశాక కామెరాన్ వైట్‌కు బాధ్యతలు అప్పగించింది. ధావన్ తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. కెప్టెన్‌గా స్యామీ... ఐపీఎల్లో పది మ్యాచ్‌లు ఆడిన తర్వాత సన్‌రైజర్స్ జట్టు నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించింది. ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్ కావడంతో హైదరాబాద్ అప్పట్లో మరో మాటకు తావు లేకుండా శిఖర్ ధావన్‌కే కెప్టెన్సీ అప్పగించింది. అయితే టోర్నీలో ఏ దశలోనూ శిఖర్ నాయకుడిగా తన ముద్ర చూపించలేకపోయాడు. పైగా కీలక సమయాల్లో అనేక చెత్త, ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకొని తన వైఫల్యాన్ని బయటపెట్టాడు. దాంతో వెస్టిండీస్ జాతీయ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీని ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా నియమించారు. గత ఏడాది కూడా సంగక్కర కెప్టెన్‌గా టోర్నీని ఆరంభించిన ఈ జట్టు సగం ముగిశాక కామెరాన్ వైట్‌కు బాధ్యతలు అప్పగించింది. ధావన్ తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. హైదరాబాద్ ఆనందించండి... కామెంటరీలో రవిశాస్త్రి శైలే వేరు. ఆకాశం బద్దలయ్యేలా గొంతు చించుకొని మాట్లాడతారు. చేతిలో మైక్ ఉన్నా... దాని అవసరం లేనట్లే అరిచే ఆ గొంతు మైక్ లేకుండానే మైదానం అంతా వినిపించగలదు. ఆదివారం కూడా టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ప్రేక్షకులవైపు తిరిగారు. ‘హైదరాబాద్... ఆనందించండి’ అంటూ తెలుగులో పెద్దగా వేసిన కేకకు స్టేడియం అదిరిపోయింది. అభిమానులు కూడా దీటుగా స్పందించడంతో మైదానం హోరెత్తిపోయింది. -
ఐపీఎల్‌కు ఉప్పల్ రెడీ!
-
ఐపీఎల్‌కు ఉప్పల్ రెడీ!
అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం సిద్ధమైంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రైజర్స్ విశ్రాంతి తీసుకోగా, ముంబై ఆటగాళ్లు స్టేడియంలో సాధన చేశారు. జాన్‌రైట్, కుంబ్లే, జాంటీ రోడ్స్ పర్యవేక్షణలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయగా...రోహిత్ శర్మ, పొలార్డ్, రాయుడు లాంటి స్టార్ క్రికెటర్లు సాధనకు దూరంగా ఉన్నారు. మైక్ హస్సీ, సిమన్స్, ఓజాలతో పాటు పలువురు యువ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. మాస్టర్ బ్యాట్స్‌మన్, ముంబై మెంటర్ సచిన్ టెండూల్కర్ మాత్రం మైదానానికి రాలేదు. -
నో కెమెరా...నో సెల్‌ఫోన్
- `ఐపీఎల్‌కు భద్రత కట్టుదిట్టం - పార్కింగ్ వివరాల ప్రకటన ఉప్పల్, న్యూస్‌లైన్: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు గతంలోలాగే కట్టుదిట్టమైన నిబంధనలు విధించారు. ఈ సారి కూడా సెల్ఫోన్లు, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లను మైదానంలోకి అనుమతించబోమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, శనివారం మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఆనంద్‌తో పాటు సైబరాబాద్ సంయుక్త కమిషనర్ వై. గంగాధర్, ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి, డీపీసీ కేకే రావు, మల్కాజ్గిరి ఏసీపీ చెన్నయ్య కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 12, 14, 18, 20 తేదీలలో ఉప్పల్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది ప్రతీ మ్యాచ్‌కు ప్రేక్షకులు, నిర్వాహక సిబ్బంది కలిపి దాదాపు 35 వేల మంది వరకు మైదానంలో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో... ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకున్నా అన్ని రకాలుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు ఆనంద్ చెప్పారు. ఐపీఎల్ కోసం లా అండ్ ఆర్డర్, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎస్బీ, సీసీఎస్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ అధికారులు కలిపి దాదాపు 1500 మంది భద్రతా సిబ్బంది ఉంటారని కమిషనర్ వివరించారు. స్టేడియం లోపల, బయట కలిపి 58 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు సహాయకారిగా ఉండేందుకు అన్ని విభాగాలతో కలిపి ఈ సారి జాయింట్ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. వాహనాల మళ్లింపు మ్యాచ్ జరిగే రోజుల్లో స్టేడియం వైపు ఎలాంటి భారీ వాహనాలను అనుమతించరు. ఘట్కేసర్నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు అక్కడినుంచే కీసర వైపు దారి మళ్లిస్తారు. ఎల్బీ నగర్‌నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. అదే విధంగా సికింద్రాబాద్, నాచారంనుంచి వచ్చే వాహనాలను ఈసీఐఎల్ మీదుగా మళ్లిస్తారు. మ్యాచ్ రోజున ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ వైపునుంచి రామంతాపూర్ వైపు ఏ రకమైన వాహనాలనూ అనుమతించరు. స్టేడియంలో విక్రేతలు ఎక్కువ ధరలకు అమ్మకుండా నిఘా ఉంచేందుకు ఈ సారి ప్రత్యేక టీమ్‌ను కూడా సిద్ధం చేశారు. పార్కింగ్ వివరాలు... కారు పాస్ ఉన్నవారికి గేట్ నం. 1, 2లనుంచి ప్రవేశం లభిస్తుంది. గేట్ నం. 3, 4, 5, 6, 7 నుంచి వెళ్లేవారు తమ కార్లను ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో, ద్విచక్ర వాహనాలను జెన్‌ప్యాక్ సర్వీస్ రోడ్డు, హబ్సిగూడనుంచి ఉప్పల్ వెళ్లే దారిలో పార్క్ చేసుకోవచ్చు. గేట్ నం. 11 నుంచి వెళ్లే ప్రేక్షకులకు ఉప్పల్ విద్యుత్ కార్యాలయం వద్ద. గేట్ నం. 8, 9, 10 ప్రేక్షకులు ద్విచక్ర వాహనాలు ఉప్పల్‌నుంచి రామంతాపూర్ రహదారి, హబ్సిగూడనుంచి ఉప్పల్ వెళ్లే రోడ్డులో పార్కింగ్ చేసుకోవచ్చు. ఫోర్ వీలర్స్ వారు రామంతపూర్నుంచి ఉప్పల్ రోడ్డులో పార్కింగ్ చేయవచ్చు. కార్పొరేట్ బాక్స్ గెస్ట్‌లు స్టేడియం పక్కన పెంగ్విన్ గ్రౌండ్లో, సిబ్బంది ఎన్జీఆర్ఐ గ్రౌండ్ గేట్ నం. 3లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు -
సన్‌రైజర్స్ సందడి
టీమ్ ప్రాక్టీస్ ప్రారంభం 14 మంది ఆటగాళ్లు హాజరు సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-7) కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ సన్నాహాలు మొదలు పెట్టింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆ జట్టు బుధవారం ప్రాక్టీస్ ప్రారంభించింది. జట్టులోని మొత్తం 24 మంది సభ్యులలో 14 మంది ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఈ సెషన్ కొనసాగుతుంది. అనంతరం రైజర్స్ దుబాయ్ బయల్దేరి వెళుతుంది. ఈ నెల 18న అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడనుంది. సరదాగా... సీరియస్‌గా... సన్‌రైజర్స్ తొలిరోజు ప్రాక్టీస్ సెషన్ దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. ముందుగా టీమ్ ట్రైనర్ జేడ్ రాబర్ట్స్ ఆటగాళ్లతో కొద్దిసేపు ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు చేయించాడు. చిన్నపిల్లల ఆటల తరహాలో కొన్ని సరదా విన్యాసాలతో శిక్షణను మొదలు పెట్టిన అతను ఆ తర్వాత సీరియస్‌గా కసరత్తు చేయించాడు. అనంతరం ప్రధాన కోచ్ టామ్ మూడీ, అసిస్టెంట్ కోచ్ హెల్మట్ కలిసి మైదానంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించారు. దాదాపు గంటపాటు సాధన చేసిన అనంతరం జట్టు సభ్యులు నెట్స్‌లోకి వెళ్లారు. మరో గంటన్నర పాటు ఆటగాళ్లు బ్యాటింగ్ సాధనలో పాల్గొన్నారు. జట్టు మెంటర్లు శ్రీకాంత్, వీవీఎస్ లక్ష్మణ్ ఈ మొత్తం శిక్షణను పర్యవేక్షించారు. ముఖ్యంగా లక్ష్మణ్ బౌలర్లకు సూచనలిస్తూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. నేరుగా దుబాయ్‌కే... తొలిరోజు భారత ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మలతో పాటు దేశవాళీ ఆటగాళ్లు కరణ్ శర్మ, నమన్ ఓజా, అనిరుధ శ్రీకాంత్, పర్వేజ్ రసూల్, ప్రశాంత్ పరమేశ్వరన్, మన్‌ప్రీత్ జునేజా, కేఎల్ రాహుల్, అమిత్ పౌనికర్ హాజరయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు వేణుగోపాలరావు, ఆశిష్ రెడ్డి, సీవీ మిలింద్, రికీ భుయ్ కూడా పాల్గొన్నారు. జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్‌తో పాటు అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్ గురువారం లేదా చివరి రోజు జట్టుతో చేరే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌లో సభ్యులుగా ఉన్న విదేశీ ఆటగాళ్లు ఫించ్, బ్రెండన్ టేలర్, స్టెయిన్, స్యామీ, వార్నర్, హోల్డర్, హెన్రిక్స్ ఈ స్వల్ప కాలిక క్యాంప్‌కు హాజరు కావడం లేదు. వారు నేరుగా దుబాయ్‌లోనే జట్టుతో కలుస్తారని రైజర్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
‘పట్టు’ కొనసాగింది
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ఫైనల్లో రెండో రోజు ఆటపై ఆధిపత్యం ప్రదర్శించిన కర్ణాటక శుక్రవారం కూడా అదే పట్టును నిలబెట్టుకుంది. మెరుగైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో మహారాష్ట్ర కొంత వరకు కోలుకున్నా... ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కకుండా నిరోధించడంలో విఫలమైంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (273 బంతుల్లో 131; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోగా, రాబిన్ ఉతప్ప (108 బంతుల్లో 72; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. క్రీజ్‌లో గోపాల్ (9 బ్యాటింగ్), వినయ్ కుమార్ (8 బ్యాటింగ్) ఉన్నారు. మహారాష్ట్ర బౌలర్లలో ఫలాకు 3 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం కర్ణాటక 169 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. మరో మూడు వికెట్లు చేతిలో ఉన్న ఆ జట్టు నాలుగో రోజు మరిన్ని పరుగులు జోడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫైనల్లో మహారాష్ట్ర పోటీలో నిలవాలంటే తీవ్రంగా శ్రమించడంతో పాటు ఏదైనా అద్భుతం జరగాల్సిందే. లేదంటే రంజీ ట్రోఫీని కర్ణాటక సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాణించిన ఉతప్ప 230/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన కర్ణాటక తొలి ఓవర్లోనే గణేశ్ సతీశ్ (117) వికెట్ కోల్పోయింది. తొలి రోజు గాయపడి బయటకు వెళ్లిన ఓపెనర్ ఉతప్ప క్రీజులోకి వచ్చి వేగంగా ఆడాడు. మరో వైపు రాహుల్ 204 బంతుల్లో కెరీర్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో వేయి పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే 72 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఉతప్ప, రాహుల్‌ను ఏడు పరుగుల వ్యవధిలో ముండే అవుట్ చేయడంతో కర్ణాటక జోరు తగ్గింది. అనంతరం తక్కువ వ్యవధిలోనే మనీశ్ పాండే (66 బంతుల్లో 36; 4 ఫోర్లు), గౌతమ్ (7)లను వెంటవెంటనే పెవిలియన్ పంపించి ఫలా మహారాష్ట్ర శిబిరంలో ఆనందం నింపాడు. అయితే కరుణ్ నాయర్ (118 బంతుల్లో 44; 4 ఫోర్లు), అమిత్ వర్మ (29) కలిసి ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను మళ్లీ నిలబెట్టారు. మహారాష్ట్ర చక్కటి బౌలింగ్‌కు తోడు చివరి సెషన్లో కర్ణాటక మరీ నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం తగ్గింది. మొత్తంగా మూడో రోజు ఆడిన 90 ఓవర్లలో కర్ణాటక 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు జత చేసింది. స్కోరు వివరాలు: మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 305. కర్ణాటక తొలి ఇన్నింగ్స్: ఉతప్ప (సి) (సబ్) త్రిపాఠి (బి) ముండే 72; రాహుల్ (సి) మొత్వాని (బి) ముండే 131; సతీశ్ (బి) ఖురానా 117; పాండే (ఎల్బీ) (బి) ఫలా 36; నాయర్ (సి) మొత్వాని (బి) ఖురానా 44; గౌతమ్ (సి) అండ్ (బి) ఫలా 7; అమిత్ వర్మ (ఎల్బీ) (బి) ఫలా 29; గోపాల్ (బ్యాటింగ్) 9; వినయ్ కుమార్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (158 ఓవర్లలో 7 వికెట్లకు) 474. వికెట్ల పతనం: 1-230; 2-318; 3-345; 4-380; 5-394; 6-447; 7-461. బౌలింగ్: సమద్ ఫలా 32-8-74-3; సంక్లేచా 25-5-66-0; దరేకర్ 26.5-4-105-0; ముండే 30-4-89-2; ఖురానా 39.1-10-110-2; అతీత్కర్ 5-0-18-0. -
కర్ణాటక కుమ్మేసింది...
సాక్షి, హైదరాబాద్: ఏడో సారి రంజీ ట్రోఫీని గెలుచుకునే దిశగా కర్ణాటక అడుగులు వేస్తోంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో మహారాష్ట్రతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో రెండో రోజు పూర్తిగా కర్ణాటక ఆధిపత్యం ప్రదర్శించింది. గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ నష్టపోకుండా 230 పరుగులు చేసింది. గణేశ్ సతీశ్ (207 బంతుల్లో 117 బ్యాటింగ్; 16 ఫోర్లు) అద్భుత సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (189 బంతుల్లో 94 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అదే దిశగా దూసుకుపోతున్నాడు. 68 ఓవర్లలో మహారాష్ట్ర ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న కన్నడ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మరో 75 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. మూడో రోజూ ఇదే తరహాలో ఆడితే జట్టుకు భారీ ఆధిక్యం దక్కడంతో పాటు మ్యాచ్‌పై పూర్తిగా పట్టు చిక్కుతుంది. అంతకు ముందు మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులకు ఆలౌటైంది. 272/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర 33 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. కర్ణాటక బౌలర్లలో వినయ్, మిథున్, అరవింద్ తలా 3 వికెట్లు పడగొట్టారు. భారీ భాగస్వామ్యం... కర్ణాటక ఇన్నింగ్స్‌ను ఉతప్ప, రాహుల్ ప్రారంభించారు. అయితే 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫలా బౌలింగ్‌లో మోచేతికి బలంగా బంతి తగలడంతో ఉతప్ప రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో రాహుల్‌తో సతీశ్ జత కలిశాడు. ఈ ఇద్దరు చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనతో కర్ణాటకను నడిపించారు. మహారాష్ట్ర ఫీల్డర్లు ఏకంగా ఐదు క్యాచ్‌లు వదిలేయడంతో... ఆ అవకాశాలను కర్ణాటక బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఉపయోగించుకున్నారు. సతీశ్ 173 బంతుల్లో కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో మరాఠా బౌలర్లు చేతులెత్తేశారు. స్కోరు వివరాలు: మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 305 (బావ్నే 89, అతీత్కర్ 50, ఖురానా 64; వినయ్ 3/81, మిథున్ 3/49, అరవింద్ 3/65) కర్ణాటక తొలి ఇన్నింగ్స్: ఉతప్ప (రిటైర్డ్‌హర్ట్) 10; రాహుల్ (బ్యాటింగ్) 94; సతీశ్ (బ్యాటింగ్) 117; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (68 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 230. బౌలింగ్: సమద్ ఫలా 16-2-40-0; సంక్లేచా 15-3-40-0; దరేకర్ 9.5-0-49-0; ముండే 12-2-43-0; ఖురానా 10-1-0-35; అతీత్కర్ 5-0-18-0. -
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైందని కలెక్టర్ ప్రద్యు మ్న పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని కాపాడేందుకు ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ మై దానంలో శకటాన్ని ప్రారంభించారు. నగరంలో ర్యాలీ తీశారు. కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్ వరకు సాగింది. అక్క డ ఆర్డీఓ యాదిరెడ్డి విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించారు. అక్కడినుంచి రాజీవ్‌గాంధీ స్టేడియం వరకు ర్యాలీ వచ్చింది. ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నివాసం మారితే అందుకు అనుగుణంగా ఓటరు జాబితాలోనూ మార్పులు చేయించుకోవాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. జిల్లాలో 25 లక్షల జనాభా ఉండగా సుమారు 18 లక్షల ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్లలో ప్రత్యేకంగా ఓటు హక్కు నమోదు కార్యక్రమం నిర్వహించామన్నారు. ఓటు హక్కు నమోదు, మార్పులు చేర్పులకోసం 1.05 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సుమారు 60 వేల మంది యువతీయువకులు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు. 50 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న నగరానికి చెందిన ఆశమ్మ, భోజప్పలను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు పొందిన వారికి ఎపిక్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శేషాద్రి, స్టెప్ సీఈఓ భిక్షానాయక్, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, ఎన్సీఎల్పీ పీడీ సుధాకర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్, ఆంధ్ర మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ సీజన్‌ను హైదరాబాద్, ఆంధ్ర జట్లు డ్రాతో ఆరంభించాయి. ఇరు జట్ల మధ్య ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. చివరి రోజు వేగంగా ఆడి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని భావించిన హైదరాబాద్ ఎలాంటి దూకుడు కనబర్చకుండా నెమ్మదిగా ఆడి టీ విరామానికి కొద్ది సేపు ముందు మాత్రమే డిక్లేర్ చేసింది. ఫలితంగా అందుబాటులో ఉన్న 34 ఓవర్లలో 288 పరుగుల టార్గెట్‌ను ముందుంచింది. ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (61 బంతుల్లో 30 నాటౌట్; 6 ఫోర్లు), డీబీ ప్రశాంత్ (53 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) అజేయంగా నిలిచారు. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో 15 మాండెటరీ ఓవర్ల ప్రారంభానికి ముందే ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అంతకుముందు 96/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 251 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హనుమ విహారి (222 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించాడు. సుమన్ (97 బంతుల్లో 36; 6 ఫోర్లు), సందీప్ (74 బంతుల్లో 33; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో సురేశ్‌కు 3 వికెట్లు దక్కగా, శివకుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌కు 3 పాయింట్లు దక్కగా, ఆంధ్ర ఖాతాలో 1 పాయింట్ చేరింది. షితాన్షుకు వీడ్కోలు... రాజ్‌కోట్: గత 21 ఏళ్లుగా సౌరాష్ట్ర క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచిన బ్యాట్స్‌మన్ షితాన్షు కొటక్‌కు ఆ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. బుధవారం ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన కొటక్ 130 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 15 సెంచరీతో 8061 పరుగులు చేశాడు. ఇతర రంజీ మ్యాచ్‌ల ఫలితాలు: పంజాబ్ ఇన్నింగ్స్, 48 పరుగులతో ఒడిషాపై విజయం గుజరాత్ ఇన్నింగ్స్ 1 పరుగు తేడాతో విదర్భపై విజయం మహారాష్ట్ర 9 వికెట్లతో త్రిపురపై విజయం కేరళ, అస్సాం మధ్య మ్యాచ్ డ్రా తమిళనాడు, సర్వీసెస్ మధ్య మ్యాచ్ డ్రా మధ్యప్రదేశ్, రైల్వేస్ మధ్య మ్యాచ్ డ్రా గోవా, హిమాచల్ ప్రదేశ్ మధ్య మ్యాచ్ డ్రా వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే ఢిల్లీ, జార్ఖండ్ మ్యాచ్ రద్దు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే బెంగాల్, బరోడా మ్యాచ్ రద్దు -
హైదరాబాద్ 221 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. ఫలితంగా ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆంధ్రతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. హనుమ విహారి (165 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్), అమోల్ షిండే (97 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 102 పరుగులు జోడించి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆంధ్ర బౌలర్లలో షాబుద్దీన్ 45 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, శివకుమార్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర రెండో రోజు సోమవారం ఆట ముగిసే సరికి 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (39 బంతుల్లో 29; 7 ఫోర్లు) అవుట్ కాగా, డీబీ ప్రశాంత్ (95 బంతుల్లో 32 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఎం.సురేశ్ (50 బంతుల్లో 17 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కీలక భాగస్వామ్యం... 44/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ అదే స్కోరు వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది. షాబుద్దీన్ వేసిన ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గల్లీలో క్యాచ్ ఇచ్చి సుమన్ (12) వెనుదిరగ్గా...అదే ఓవర్ మూడో బంతికి సందీప్ (0) ఎల్బీగా అవుటయ్యాడు. ఈ దశలో విహారి, షిండే కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆరంభంలో పూర్తిగా నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యతనిచ్చిన ఈ ఇద్దరు ఆ తర్వాత కొన్ని చక్కటి షాట్లతో స్కోరు వేగం పెంచారు. ఈ క్రమంలో 92 బంతుల్లో విహారి, 89 బంతుల్లో షిండే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు భాగస్వామ్యం కూడా వంద పరుగులు దాటింది. షిండేను అవుట్ చేసి శివకుమార్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ వెంటనే ఆశిష్ రెడ్డి (10) కూడా షాబుద్దీన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఈ దశలో ధాటిగా ఆడిన కీపర్ హబీబ్ అహ్మద్ (32 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) కొద్ది సేపు విహారికి అండగా నిలవడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఏడో వికెట్‌గా విహారి వెనుదిరిగాక కొద్ది సేపటికే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. భరత్ దూకుడు... అనంతరం ఆంధ్ర ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు భరత్, ప్రశాంత్ ధాటిగా ఆరంభించారు. మిలింద్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన భరత్, అదే బౌలర్ మూడో ఓవర్లో కూడా మరో రెండు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించిన అనంతరం ఆశిష్‌రెడ్డి హైదరాబాద్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆఫ్ స్టంప్ వచ్చిన బంతిని కట్ చేయబోయిన భరత్, కీపర్ హబీబ్ అద్భుత క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మరో వైపు ప్రశాంత్ మాత్రం ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా సంయమనంతో ఆడాడు. టీ తర్వాత రెండో ఓవర్లో ఓజా బౌలింగ్‌లో స్లిప్స్‌లో ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను రవితేజ వదిలేయడం ప్రశాంత్‌కు కలిసొచ్చింది. మిలింద్ బౌలింగ్‌లో మోచేతికి దెబ్బ తగలడంతో కొద్ది సేపు చికిత్స చేయించుకున్న అనంతరం ఆటను కొనసాగించిన ప్రశాంత్...సురేశ్‌తో కలిసి అభేద్యంగా 43 పరుగులు జోడించి రెండో రోజు ఆటను ముగించాడు.