కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైందని కలెక్టర్ ప్రద్యు మ్న పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని కాపాడేందుకు ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ మై దానంలో శకటాన్ని ప్రారంభించారు. నగరంలో ర్యాలీ తీశారు. కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్ వరకు సాగింది.
అక్క డ ఆర్డీఓ యాదిరెడ్డి విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించారు. అక్కడినుంచి రాజీవ్‌గాంధీ స్టేడియం వరకు ర్యాలీ వచ్చింది. ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నివాసం మారితే అందుకు అనుగుణంగా ఓటరు జాబితాలోనూ మార్పులు చేయించుకోవాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. జిల్లాలో 25 లక్షల జనాభా ఉండగా సుమారు 18 లక్షల ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌లలో ప్రత్యేకంగా ఓటు హక్కు నమోదు కార్యక్రమం నిర్వహించామన్నారు. ఓటు హక్కు నమోదు, మార్పులు చేర్పులకోసం 1.05 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
సుమారు 60 వేల మంది యువతీయువకులు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు. 50 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న నగరానికి చెందిన ఆశమ్మ, భోజప్పలను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు పొందిన వారికి ఎపిక్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శేషాద్రి, స్టెప్ సీఈఓ భిక్షానాయక్, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, ఎన్‌సీఎల్‌పీ పీడీ సుధాకర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటేయాలి
Published Sun, Jan 26 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement