ఢిల్లీ పాలనా వ్యవహారాల నియంత్రణ లెఫ్టినెంట్ గవర్నర్‌దా? లేక ప్రభుత్వానిదా ? అన్న విషయంపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ నేత రాఘవ చద్ధా స్పందిస్తూ..ఈ తీర్పు బీజేపీకి అతి పెద్ద గుణపాఠమని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజ్యాంగం అందించిన చక్కటి అధికార సమతుల్యతను భంగపరచకూడదని చెప్పకనే చెప్పింది అత్యున్నత న్యాయస్థానం.
ఇది నిజంగా బీజేపికీ ఒక పెద్ద గుణపాఠం కావాలన్నారు. ఇది ముమ్మాటికి ఢిల్లీ ప్రజల విజయమేనని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులమైన మేము ఇప్పుడూ హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నామని ఎద్దేవా చేశారు. అలాగే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అణగదొక్కడానికి బీజేపీ అనుసరించే ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి లేదా రాజకీయాలకైనా మంచిది కాదని ఇప్పటికైన గ్రహించాలన్నారు. సుప్రీం కోర్టు కూడా ఈ రోజు దాన్నే చెప్పిందన్నారు.
అంతేగాదు ఢిల్లీ ప్రభుత్వాన్ని అధిగమిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు బ్యూరోక్రసిపై పూర్తి అధికారాన్ని ఇచ్చిన మే 2015 నాటి కేంద్ర నోటిఫికేషన్‌ను గుర్తు చేస్తూ..దీనికి కేవలం రాజకీయమే కారణమని చద్ధా అన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి ఢిల్లీలో కేంద్ర ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య ఎనిమిదేళ్లుగా జరుగుతున్న గొడవల తర్వతా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు.
( చదవండి: రాహుల్‌కి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు: ఇది మీ హోదాకి తగ్గ పని కాదు!)
Comments
Please login to add a commentAdd a comment