ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచారపర్వంలో అటు బీజేపీ ఇటు ఆప్, కాంగ్రెస్‌లు దూసుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ప్రచారంలో పాల్గొన్న ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాట్లాడుతూ ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి కుటుంబం విద్యుత్, తాగునీరు, మందులు, పాఠశాల ఫీజులపై ప్రతి నెలా రూ. 18 వేలు ఆదా చేస్తున్నదని పేర్కొన్నారు.
త్వరలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలోని మహిళలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అందజేయనుందని అన్నారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తరపున ప్రచారం చేపట్టిన ఆయన.. నిరాడంబరమైన నేపథ్యాలు కలిగిన వారు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులకు చేరుకోవడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
‘ఆప్’ ఎల్లప్పుడూ సాధారణ కుటుంబాలకు చెందిన వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసిందని, కుల్దీప్ కుమార్, తాను దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు. విద్యావంతులు, నిజాయితీ గల ప్రతినిధులను ఎన్నుకోవడానికి గల ప్రాముఖ్యతను రాఘవ్ చద్దా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment