APP MP Raghav Chadha Responds To BJP Crow Pic Tweet - Sakshi
Sakshi News home page

ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా తలపై తన్నిన కాకి.. ‘అబద్ధాలు చెబితే కాకి తంతుంది’ బీజేపీ ట్వీట్‌ వైరల్‌

Published Wed, Jul 26 2023 8:42 PM | Last Updated on Wed, Jul 26 2023 9:03 PM

APP MP Raghav Chadha Responds To BJP Crow Pic Tweet - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఆవరణలో బుధవారం ఓ విచిత్ర సంఘటన వెలుగుచూసింది. ఆమ్‌ ఆద్మీ రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దాపై ఓ కాకి దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

పార్లమెంట్‌ ఆవరణంలో రాఘవ్‌ చద్దా నిల్చొని ఫోన్‌ మాట్లాడుతుండా ఓ కాకి ఆయన తలపై తన్ని వెళ్లింది. అనూహ్య పరిణామానికి ఆయన కాస్తా కంగారుపడ్డారు. అయితే ఆ ఘ‌ట‌న‌కు చెందిన ఫోటోల‌ను బీజేపీకి చెందిన ఢిల్లీ యూనిట్ త‌మ  ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. ‘జూట్ బోలే కౌవా కాటే’అంటూ ఆ ఫోటోకు కామెంట్ పెట్టింది. అబద్ధం చెబితే కాకి పొడుస్తుందనే సామెతను ఇప్పటి వరకు విన్నాం, కానీ ఇప్పుడు అబ‌ద్దాలు చెప్పిన ఎంపీ రాఘ‌వ్‌ను కాకి కొట్టడం ద్వారా కళ్లారా చూస్తున్నాం’ అని పేర్కొన్నారు.
చదవండి: మీ మాటలకు చేతలకూ పొంతన లేదు: మోదీ, షాలపై ఖర్గే విమర్శలు

మరోవైపు కాకి దాడి చేయడంపై ఎగతాళి చేస్తూ బీజేపీ చేసిన కామెంట్‌కు రాఘవ్‌ చద్దా గట్టి కౌంటర్‌ ఇచ్చారు. హంస గింజలు తినే.. కాకి ముత్యాల విందు చేసే కలియుగం వస్తుందని  శ్రీరాముడు సీతతో చెప్పాడు’ అనేది మనం ఇప్పటివరకు విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం’ అంటూ రామాయణ ఇతిహాసం గురించి ప్రస్తావిస్తూ అటాక్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement