బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుగ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీరిద్దరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు.
అయితే హీరోయిన్ భర్త కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే. క్రికెట్‌లో మంచి బౌలర్ కూడా. తాజాగా ఆయన ఓ దేశవాళీ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనురాగ్ ఠాకూర్ బ్యాటింగ్ చేస్తుండగా తన స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేశాడు. కాగా.. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ వర్సెస్ రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మాల్దీవుస్‌లో వెడ్డింగ్ డే..
గతంలోనే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట. తన భర్త రాఘవ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరూ మాల్దీవుస్‌లో తమ మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment