
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఎన్నికల ప్రచారానికి గైర్హాజరు కావడంపై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. రాఘవ్ చద్దా కంటి శస్త్ర చికిత్స కోసం యూకేలో ఉన్నారని తెలిపారు.
రాఘవ్ కళ్లకి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స పొందేందుకు యూకే వెళ్లారు. సమస్య తీవ్రమైనదని, సకాలంలో చికిత్స అందించకపోతే అంధత్వం వచ్చే అవకాశం ఉందని రాఘవ్ చద్దా తన చెప్పారంటూ భరద్వాజ్ వెల్లడించారు.
రాఘవ్ చద్దా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కోలుకున్న వెంటనే ఆయన ప్రచారంలో పాల్గొంటారని అన్నారు.
చికిత్స కోసం భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నాటి నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్ధులకు మద్దతుగా సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేయడంతో పాటు ఇతర పరిణామాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందిస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment