సమంత ప్రాజెక్ట్ క్రేజీ అప్‌డేట్.. షూటింగ్‌ ఎప్పుడంటే? | Samantha Latest OTT Project Shooting Starts In November | Sakshi
Sakshi News home page

Samantha OTT Project: సమంత మరో వెబ్‌ సిరీస్.. షూటింగ్‌ ఎప్పుడంటే?

Published Thu, Oct 6 2022 9:54 PM | Last Updated on Thu, Oct 6 2022 9:55 PM

Samantha Latest OTT Project Shooting Starts In November - Sakshi

టాలీవుడ్‌లో క్రేజ్ సంపాందించుకున్న స్టార్ హీరోయిన్ సమంత. ఇటీవల ఆమె బాలీవుడ్‌లో ఓటీటీ ప్రాజెక్ట్‌ల‍్లోనూ నటిస్తోంది. తాజాగా ఆమె లేటెస్ట్ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఆమె మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా తెరకెక‍్కిస్తున్న ఓటీటీ ప్రాజెక్ట్‌కు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన రెండు పాన్-ఇండియా చిత్రాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. 

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ మేకర్స్ రాజ్, డీకే దర్శకత్వం వహించే ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి ఈ భామ నటించనుంది. ఇది హాలీవుడ్ సిరీస్ 'సిటాడెల్'కి రీమేక్‌గా వస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత రాజ్, డీకేతో సమంత రెండో ప్రాజెక్ట్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సమంత లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాని నవంబర్‌ 4న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ఆ మధ్య ప్రకటించింది. అయితే ‘శాకుంతలం’ని 3డీలో అందించాలనే నిర్ణయంతో సినిమా విడుదలని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement