అది శృంగార సీన్ ఎలా అవుతుంది?.. మండిపడ్డ మెహ్రీన్ | Mehreen Pirzada Slams Calling Her Scene Marital Offence From Sultan Of Delhi - Sakshi
Sakshi News home page

Mehreen Pirzada: ఇలాంటి ఆలోచన చాలా దారుణం: మెహ్రీన్

Published Wed, Oct 18 2023 1:00 PM | Last Updated on Wed, Oct 18 2023 1:37 PM

Mehreen Pirzada slams calling her Scene marital Offence from Sultan Of Delhi  - Sakshi

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మెహ్రీన్ పీర్జాదా.  తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ టాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. గతేడాది ఎఫ్‌3 సినిమాతో ప్రేక్షకులను అలరించిన మెహ్రీన్.. ఈ ఏడాదిలో ఓటీటీలోనూ అరంగేట్రం చేసింది. ఇటీవలే ఆమె నటించిన  సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే ఈ సిరీస్‌లో ఆమె ఓ అత్యాచార సన్నివేశంలో నటించింది. అయితే ఈ సీన్‌ ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఆ సన్నివేశాన్ని కొందరు శృంగార సీన్‌గా అభివర్ణించడంపై మెహ్రీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా రాయడం తనకు తీవ్ర బాధ కలిగించిందని ట్వీట్ ద్వారా వెల్లడించింది. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!)

మెహ్రీన్ ట్వీట్‌లో రాస్తూ.. 'ఢిల్లీ సుల్తాన్‌లో వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే ఓ సన్నివేశం ఉంది. మనదేశంలో ఇది తీవ్రమైన సమస్య. ఇలాంటి సమస్యను మీడియాలో చాలా మంది శృంగార సీన్‌గా అభివర్ణించడం నాకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలకు ఇది తీవ్రమైన సమస్య. ఈ విషయాన్ని ఇలా చెప్పడం సమస్యను చిన్నదిగా చూపించినట్లు అవుతుంది. సోషల్ మీడియాలోని వ్యక్తులు ఇలా చేయడం నన్ను కలవరపెడుతోంది. ఇలాంటి వారు తమకు సోదరీమణులు, కుమార్తెలు కూడా ఉన్నారన్న విషయం అర్థం చేసుకోవాలి.  వారు తమ నిజ జీవితంలో అలాంటి బాధను ఎప్పటికీ ఎదుర్కోవద్దని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మహిళలపై ఇలాంటి క్రూరత్వం, హింస అనే ఆలోచన చాలా అసహ్యకరమైనది.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతే కాకుండా నటుడిగా ఆ పాత్రకు న్యాయం చేయడం నా పని అని తెెలిపింది. మిలన్ లుథ్రియా సర్ నేతృత్వంలోని సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ బృందం చాలా కష్టతరమైన సన్నివేశాల షూటింగ్ సమయంలో నటులుగా మేం చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నామని పేర్కొం‍ది. నేను చేసే పాత్ర మహాలక్ష్మి అయినా, సంజన అయినా, హనీ అయినా నా ఫ్యాన్స్ కోసం ప్రతి పాత్రలోనూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. 

(ఇది చదవండి: అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్‌ ఠాకూర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement