'The Last Of Us' Fans Spotted a Filming Mistake in Episode 6 - Sakshi
Sakshi News home page

Film Making: అరే ఏంట్రా ఇది.. సీన్‌ మధ్యలో అరుదైన సంఘటన..!

Published Mon, Feb 27 2023 3:21 PM | Last Updated on Mon, Feb 27 2023 4:07 PM

The Last Of Us Fan Spotted A Filming Mistake In Episode 6 in Hollywood - Sakshi

సినిమాల్లో తప్పులు దొర్లడం మనం సాధారణంగా చూస్తుంటాం. కొన్ని సీన్లలో అనుకోకుండా పొరపాట్లు చేస్తుంటారు. అలాగే ఓ హాలీవుడ్‌లో వెబ్‌సిరీస్‌లోనూ అదే జరిగింది. ఓ సీన్ చిత్రీకరించేటప్పుడు సిబ్బంది కూడా ఆ సీన్‌లో కనిపించారు. అది గమనించని మేకర్స్ ఎపిసోడ్‌ను అలాగే రిలీజ్ చేశారు. ఇది గమనించిన ఫ్యాన్స్ ఆ సీన్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

హెచ్‌బీవో వారి ది లాస్ట్ ఆఫ్ అస్ వెబ్ సిరీస్ ఇప్పటికే భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రెండో సీజన్ కొనసాగుతోంది. అయితే ఆదివారం రిలీజైన కొత్త ఎపిసోడ్‌లో కొన్ని సన్నివేశాల్లో ఏకంగా సిబ్బంది కనిపించారు. ఓ అభిమాని వాటిని గుర్తించి ఆ సీన్‌ ఫోటోలు, వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఏంటీ ఇలా కూడా సీన్స్‌ తెరకెక్కిస్తారా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

ది లాస్ట్ ఆఫ్ అస్ కొత్త ఎపిసోడ్ - 'కిన్‌లో' జోయెల్ (పెడ్రో పాస్కల్), ఎల్లీ (బెల్లా రామ్‌సే), జోయెల్ సోదరుడు టామీ (గాబ్రియేల్ లూనా)తో తిరిగి కలుసుకుంటారు. ఈ ఎపిసోడ్‌కు మంచి ఆదరణ లభించగా.. ఇందులో అనేక మంది సిబ్బంది ఉన్నట్లు ఒక టిక్‌టాక్ యూజర్ గుర్తించాడు. ఈ సీన్‌లో జోయెల్, ఎల్లీ మంచుతో కప్పబడిన వంతెనపై నడుస్తున్నప్పుడు అక్కడ మిగతా సిబ్బంది కూడా కనిపించారు. జూమ్ చేసినప్పుడు ఆ సంఖ్య ఎక్కువగా కనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement