టబుకి హాలీవుడ్‌ చాన్స్‌.. ఆ వెబ్‌ సీరీస్‌లో కీలక పాత్ర! | Tabu To Play Key Role In Prequel Series To Hollywood Film Dune | Sakshi
Sakshi News home page

టబుకి హాలీవుడ్‌ చాన్స్‌.. ఆ వెబ్‌ సీరీస్‌లో కీలక పాత్ర!

Published Wed, May 15 2024 1:53 PM | Last Updated on Wed, May 15 2024 3:15 PM

Tabu To Play Key Role In Prequel Series To Hollywood Film Dune

సీనియర్‌ నటి టబు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస బాలీవుడ్‌ చిత్రాలతో దూసుకెళుతున్నారు. ఇటీవల విడుదలైన ‘క్రూ’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టబు ప్రస్తుతం హిందీలో మరికొన్ని ప్రాజెక్ట్‌లు కమిట్‌ అయ్యారు. అలాగే హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘డ్యూన్‌: ఫ్రొఫెసి’లో నటించే లక్కీ చాన్స్‌ అందుకున్నారు. 

‘డ్యూన్‌’ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్‌ ఉంది. తొలి భాగానికి మంచి స్పందన రావడంతో రెండో భాగం ‘డ్యూన్‌: ఫ్రొఫెసి’ని ప్లాన్‌ చేశారు మేకర్స్‌. ఇందులో సిస్టర్‌ ఫ్రాన్సెస్‌ అనే ఎంతో ప్రాధాన్యమైన పాత్రలో టబు నటించనున్నారు. డయాన్‌ అడెము–జాన్‌ క్రియేషన్‌లో ఈ సిరీస్‌ రూపొందనుంది. పది వేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది? అనే పాయింట్‌తో ‘డ్యూన్‌’ తొలి భాగం రూపొందింది. ‘డ్యూన్‌: ఫ్రొఫెసి’ని సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో తెరకెక్కించనున్నారట. తొలి భాగం కంటే ఐదు రెట్ల బడ్జెట్‌ కేటాయించారని టాక్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement