నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కానీ ఆ వీడియో భారత సంతతికి చెందిన అమ్మాయి జరా పటేల్‌గా గుర్తించారు. గత నెల ఆమె తన ఇన్‌స్టాలో ఈ వీడియోను షేర్ చేసింది. అయితే కొందరు దుండగులు డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో రష్మిక ఫేస్ వచ్చేలా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఈ వీడియోను అగ్రనటులు సైతం ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు. ఇది చూశాక చాలా భాదపడ్డానని రష్మిక ట్వీట్ చేసింది.
అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన డీప్ ఫేక్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం టైగర్-3 చిత్రంలో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ సీన్‌లో వచ్చే కత్రినా ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్.. మరో హాలీవుడ్ మిచెల్ లీతో టవల్ ఫైట్ సీన్‌లో కనిపించింది. ఈ సీన్ సినీ ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకట్టుకంది.
అయితే తాజాగా ఈ ఫైట్ సీన్‌లోని కత్రినా ఫోటోను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసినట్లు కనిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఇద్దరు స్టార్ హీరోయిన్లపై ఇలాంటి సంఘటనలు జరగడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సినీతారలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment