ఒక సినిమా హిట్టయిందంటే వెంటనే దాని సీక్వెల్ గురించి చర్చ మొదలవుతుంది. చివరకు కథ రెడీ అయితే సీక్వెల్ పట్టాలెక్కడం ఖాయం. అలా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ మూవీ టైగర్‌కు గతంలో సీక్వెల్ తెరకెక్కింది. తాజాగా టైగర్ 2కి సీక్వెల్‌గా టైగర్ 3 తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి లేకే ప్రభు కా నామ్ సాంగ్ రిలీజైంది. ప్రీతమ్ కంపోజ్ చేసిన ఈ పాటను అర్జిత్ సింగ్, నిఖిత గాంధీ పాడారు. తెలుగు, తమిళ వర్షన్స్ మాత్రం బెన్నీ దయాల్, అనూశ మణి పాడారు. ఇక ఈ పాటలో కత్రినా స్టెప్పులకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. హిందీ వర్షన్ యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ పాటకు వస్తున్న స్పందనపై కత్రినా స్పందించింది. ఒక ఆర్టిస్టుగా నాకు ఎక్కడలేని ప్రేమాభిమానాలు అందిస్తున్నారు. లెకె ప్రభు కా నామ్ పాటను ఎంతో హిట్ చేశారు. అందుకు చాలా సంతోషంగా ఉంది.
నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. జనాలు మా నటనతో పాటు పాటలు, డ్యాన్సులు కూడా చూస్తారు. ఆ రెండు కూడా సినిమాలో భాగమే. పాటల వల్ల కూడా జనాలు సినిమాకు కనెక్ట్ అవుతుంటారు. అందుకే ఏ పాట అయినా దానికి ఎంతో బాగా డ్యాన్స్ చేయాలని ప్రయత్నిస్తుంటాం. ప్రేక్షకులను నిరాశపర్చకూడదని కష్టపడుతుంటాం' అని చెప్పుకొచ్చింది. కాగా టైగర్ 3 మూవీ దీపావళి కానుకగా నవంబర్ 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
చదవండి: భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్ సిరీస్‌గా.. ఏ ఓటీటీలో అంటే?
Comments
Please login to add a commentAdd a comment