సినిమా చూసే ప్రేక్షకుడంటే చాలామంది దర్శకనిర్మాతలకు లోకువ. అందుకే పిచ్చి పిచ్చి సినిమాలు తీసి కొందరు మెంటలెక్కిస్తుంటారు. అది కాదన్నట్లు థియేటర్ వరకు ప్రేక్షకుడిని రప్పించేందుకు పబ్లిసిటీలో లేనిపోని జిమ్మిక్కులన్నీ చేస్తుంటారు. దీపావళి కానుకగా ఆదివారం థియేటర్లలోకి వచ్చిన సల్మాన్ 'టైగర్ 3' విషయంలో అలాంటిదే చేశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఇంతకీ ఏంటి విషయం?
గత నెలలో విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో 'లియో' సినిమా రిలీజైంది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకుంది. కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేశాడని చెప్పి, విడుదలకు కొన్నిరోజుల ముందు హడావుడి చేశారు. తీరా థియేటర్లలో సినిమా చూస్తే అదంతా ఉత్తిదే అని తేలింది.
(ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్)
ఇకపోతే బాలీవుడ్ స్పై యూనివర్స్‌లోని సినిమా అయిన 'వార్ 2'లో మన తెలుగు హీరో జూ.ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇదే యూనివర్స్‌లో తీసిన 'టైగర్ 3' మూవీలోనూ ఎన్టీఆర్ అతిథి పాత్ర చేశాడని.. గత కొన్నిరోజుల నుంచి బాలీవుడ్ మీడియా తెగ రాసిపడేశారు. తీరా చూస్తే ఎన్టీఆర్ లేడని క్లారిటీ వచ్చేసింది. హృతిక్ కూడా ఓ సీన్ లో చూపించారు కానీ పెద్దగా సినిమాకు ప్లస్ అయితే కాలేదని అంటున్నారు.
పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత తెలుగు హీరోల రేంజు పెరిగింది. దీంతో పక్క ఇండస్ట్రీలో పలువురు నిర్మాతలు.. దీన్ని వేరేలా ఉపయోగించుకుని తెలుగు ప్రేక్షకుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే మనోళ్లు సదరు నిర్మాతల కంటే తెలివైనోళ్లు కాబట్టి 'లియో'లో రామ్ చరణ్, 'టైగర్ 3'లో ఎన్టీఆర్ లాంటి వార్తల్ని లైట్ తీసుకుంటున్నారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!)
Comments
Please login to add a commentAdd a comment