సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్
సిల్వర్ స్క్రీన్‌పై సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ల రొమాంటిక్ కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుందంటారు సినీ ప్రియులు. ‘టైగర్’ ఫ్రాంచైజీలో ‘ఏక్తా టైగర్’ వంటి సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన మరో చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం నవంబరు 12న విడుదల కానుంది.
ఈ సినిమాలోని సల్మాన్, కత్రినా కాంబినేషన్‌లోని రొమాంటిక్ సాంగ్ ‘లేకే ప్రభు కా నామ్’ పాట పూర్తి లిరికల్ వీడియోను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రీతమ్ స్వరపరచిన ఈ పాటను ఆర్జిత్ సింగ్ పాడారు. సల్మాన్‌కి ఆర్జిత్ సింగ్ పాడిన తొలి పాట ఇది.
Comments
Please login to add a commentAdd a comment