
టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో జోరుమీదున్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ఆమె నటించిన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో నటిస్తున్నారు ఈ మలయాళ బ్యూటీ. రవితేజ–శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కూడా అనూనే కథానాయిక. అయితే.. డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారామె.
హీరోయిన్‌గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తొలిసారి ఓ చిత్రంలో అతిథి పాత్ర చేస్తున్నారట. విజయ్ దేవరకొండ, ‘ఛలో’ ఫేమ్ రష్మిక మండన్నా జంటగా దర్శకుడు పరశురామ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘గీతాగోవిందం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ అతిథి పాత్ర చేస్తున్నారని టాక్. కథలో ముఖ్యమైన రోల్‌కి అనూ అయితే కరెక్ట్‌గా సరిపోతారన్నది చిత్రబృందం ఆలోచనట. సినిమాలో పది నిమిషాలు ఉండే ఈ పాత్ర కోసం చిత్రవర్గాలు ఆమెను సంప్రదించడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment