
బోయపాటికి అతిథి దొరికాడు
సరైనోడు సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడు బోయపాటి శ్రీను. తన కెరీర్లో ఇప్పటి వరకు స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన ఈ మాస్ యాక్షన్ స్పెషలిస్ట్, తన నెక్ట్స్ సినిమాను మాత్రం ఓ యంగ్ హీరోతో చేయబోతున్నాడు. సరైనోడు సినిమా కన్నాముందే అంగీకరించిన ప్రాజెక్ట్ కావటంతో కాదనలేక కంటిన్యూ అవుతున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది.
అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బోయపాటి. అయితే ఈ యంగ్ హీరో సినిమాకు తన రేంజ్ హీరోయిజం యాడ్ చేసే పనిలో ఉన్నాడు. అందుకే సాయి శ్రీనివాస్తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలను ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటింపచేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
వీటిలో ఒక పాత్రకు సీనియర్ హీరో వెంకటేష్ అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. గతంలో తులసి సినిమా కోసం వెంకటేష్, బోయపాటిలు కలిసి నటించారు. వెంకటేష్కు బెల్లంకొండతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈ సినిమాలో గెస్ట్ అపీయరెన్స్ ఇవ్వడానికి అంగకీరించాడట. త్వరలోనే ఇతర నటీనటులను సాంకేతిక నిపుణులను వెల్లడించనున్నారు.