
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో రిలీజ్ ముందే ఓ ప్రచారం చాలా బలంగా జరిగింది. సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నాడని ఆయన పాత్రే కథను మలుపు తిప్పుతుందన్న టాక్ వినిపించింది.
చిత్రయూనిట్ కూడా ఈ ప్రచారాన్ని ఏ దశలోనూ ఖండించలేదు. అధికారికంగా వెంకటేష్ అతిథి పాత్ర చేస్తున్నట్టుగా ప్రకటించకపోయినా, రూమర్ ఖండిచకపోయే సరికి పవన్ వెంకీల జోడి మరోసారి తెర మీద సందడి చేయటం ఫిక్స్ అని భావించారు ఫ్యాన్స్. అయితే సినిమాలో వెంకటేష్ కనిపించలేదు. దీంతో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తున్నాడన్న రూమర్ పబ్లిసిటీ కోసం చేసుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు వెంకీ కనిపించే సీన్స్ కొద్ది రోజుల తరువాత యాడ్ చేస్తారని కొత్త ప్రచారం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment