ఆ సినిమాలో గెస్ట్ పాత్ర దొరికినా అదృష్టమే: రాంచరణ్ | i am lucky even if i get guest role in that movie, says ramcharan | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలో గెస్ట్ పాత్ర దొరికినా అదృష్టమే: రాంచరణ్

Published Wed, May 13 2015 5:24 PM | Last Updated on Wed, Jul 25 2018 3:25 PM

ఆ సినిమాలో గెస్ట్ పాత్ర దొరికినా అదృష్టమే: రాంచరణ్ - Sakshi

ఆ సినిమాలో గెస్ట్ పాత్ర దొరికినా అదృష్టమే: రాంచరణ్

తన తండ్రి చిరంజీవి నటించే 150వ సినిమాలో గెస్ట్ పాత్ర దొరికినా అదృష్టమేనని హీరో రాంచరణ్ అన్నాడు. ఈ సినిమాకు చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, ప్రకటన చేయడానికి రెండు రోజుల ముందే తాను మొత్తం స్క్రిప్టు విన్నానని తెలిపాడు. అభిమానుల అంచనాలకు ఈ సినిమా రీచ్ అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ వివరించాడు. నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్గా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement