నిప్పు రా..! | Rajinikanth to Play a Guest Role in Neruppu da ?? | Sakshi
Sakshi News home page

నిప్పు రా..!

Published Thu, Sep 15 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

నిప్పు రా..!

నిప్పు రా..!

 నిప్పు రా.. తాకరా... అంటూ ‘కబాలి’లో రజనీకాంత్ తెరపై కనిపించగానే అభిమానులు పరమానందపడిపోయారు. అచ్చంగా రజనీ స్టైల్‌కి తగ్గ పాట అది. రజనీ తనదైన స్టైల్‌లో నడుస్తుంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ‘కబాలి’ విడుదలై నెల రోజులు పైనే అయ్యింది. ఇప్పుడీ పాట గురించిన ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? మరేం లేదు. ‘నెరుప్పు డా’ పేరుతో రూపొందనున్న ఓ తమిళ చిత్రంలో రజనీ అతిథి పాత్ర చేయనున్నారట.
 
 నెరుప్పు డా అంటే నిప్పు రా అని అర్థం. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ తనయుడు, నటుడు ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు హీరోగా రూపొందనున్న చిత్రం ఇది. ఇందులో హీరో ఫైర్ సర్వీస్‌లో పని చేస్తుంటాడు. రజనీ అభిమాని. ఓ సన్నివేశంలో హీరోకి తన అభిమాన సూపర్ స్టార్ కనిపిస్తాడట. ఆ సీన్ రజనీ చేస్తే బాగుంటుందని చిత్రబృందం భావించింది. శివాజీ కుటుంబంతో రజనీకి మంచి అనుబంధం ఉంది.
 
 ‘జస్టిస్ గోపీనాథ్’, ‘నాన్ వాళవైప్పేన్’, ‘పడిక్కాదవన్’, ‘నరసింహా’... ఇలా నాలుగైదు చిత్రాల్లో శివాజీ కాంబినేషన్‌లో రజనీ నటించారు. ప్రభుతో ‘గురు శిష్యన్’, ‘చంద్రముఖి’ చిత్రాల్లో నటించారు. అదే కుటుంబానికి చెందిన విక్రమ్ ప్రభు సినిమా కాబట్టి, గెస్ట్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. నూతన దర్శకుడు బి. అశోక్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement