దటీజ్ కబాలి! | Rajinikanth's 'Neruppu Da' now a film title | Sakshi
Sakshi News home page

దటీజ్ కబాలి!

Published Fri, Jul 8 2016 3:45 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

దటీజ్ కబాలి!

దటీజ్ కబాలి!

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' విడుదలకు ముందే సృష్టిస్తోంది. ఈ సినిమాలోని 'నిరుప్పుడా' తమిళ పాట టీజర్ లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే పేరుతో ఏకంగా సినిమానే తెరకెక్కిస్తున్నారు. బి. అశోక్ కుమార్ అనే దర్శకుడు తన తొలి సినిమాకే 'నిరుప్పుడా' టైటిల్ పెట్టాడు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటించనున్నాడు. కథకు అనుగుణంగానే ఈ పేరు పెట్టినట్టు అశోక్ కుమార్ వెల్లడించారు.

'అగ్నిమాపక దళం సేవలు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రజనీ కాంత్ అంటే పడిచచ్చే ఫైర్ మ్యాన్ గా విక్రమ్ ప్రభు కనిపించనున్నాడు. బాగా ఆలోచించే నిరుప్పుడా టైటిల్ పెట్టాం. ఈ పేరే మా సినిమాకు అన్నివిధాలా సరిపోతుంద'ని అశోక్ కుమార్ తెలిపారు. 'కబాలి' సినిమా నిర్మాత కళైపులి ఎస్ థాను అంగీకారంతోనే 'నిరుప్పుడా' టైటిల్ పెట్టామన్నారు. విక్రమ్ ప్రభు సరసన నిక్కీగల్రాణి నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభంకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement