Neruppu da
-
నాతో పోటీనా అన్నారు
మహా నటుడు శివాజీగణేశన్ ఏరా నాతో పోటీయా? అన్నారని సూపర్‌స్టార్ రజనీకాంత్ గత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. శివాజీగణేశన్ మనవడు, ప్రభు కొడుకు, యువ నటుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటిస్తూ, తొలిసారి నిర్మాతగా మారి ఫస్ట్ ఆర్టిస్ట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నెరుప్పుడా. నిక్కీగల్రాణి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు అశోక్‌కుమార్ పరిచయం అవుతున్నారు. ఆర్డి. రాజశేఖర్ ఛాయాగ్రహణం, సాన్‌రోల్డన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక బోగ్రోడ్డులోని శివాజీ గణేశన్ ఇంటి ఆవరణలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు రజనీకాంత్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా తొలి సీడీని శివాజీగణేశన్ తనయులు రామ్‌కుమార్, ప్రభు, గిరి అందుకున్నారు. కార్యక్రమంలో పాల్గొ న్న మరో అతిథి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం కార్యదర్శి, నటుడు విశాల్ మాట్లాడుతూ సినిమాపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. అలాంటి సినిమా విడుదలైన తొలి రోజు, తొలి ప్రదర్శన ముగిసిన వెంటనే మీడియా వర్గాలు విమర్శలు రాసేస్తున్నారన్నారు. అలాంటి విమర్శలు చిత్రాన్ని తీవ్రంగా ప్రభా వితం చేస్తున్నాయన్నారు. అందువల్ల రెండు, మూడు రోజు ల తరువాత విమర్శలు రాస్తే బాగుంటుందని అన్నారు. ఏరా పోటీనా అన్నారు నటుడు రజనీకాంత్ మాట్లాడుతూ నెరుప్పుడా చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని, ఈ విషయంలో మరో మాటకు తావులేదని అన్నారు. చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. విక్రమ్‌ప్రభు నిర్మాతగా కూడా నూరు శాతం సక్సెస్ అవుతారన్నారు. శివాజీ గణేశన్‌తో కలిసి తాను పడయప్పా చిత్రంలో నటించానని ఆ చిత్రం ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. ఒక సారి ఫోన్ చేసి ఫ్రీగా ఉన్నావా? ఇంటికి రా బిరియాని పెడతాను అని అన్నారన్నారు. సరే ప్రత్యేకంగా పిలిచారని వెళితే అప్పటికే 200 మంది ఉన్నారన్నారు. అదే విధంగా బిరియాని పెడతారని చూస్తే పలు రకాల ఆహార పదార్థాలు ఉన్నాయన్నారు. ఆయన ఇంట్లో ప్రతి ఆదివారం అలాగే జరుగుతుండేదని తెలిపారు. అన్నామలై చిత్రంలో తాను శివాజీగణేశన్ నటనను అనుకరిస్తూ నటించానన్నారు. చిత్రాన్ని ఆయనకు చూపించగా ఏరా నాకు పోటీయా? అని సరదాగా అన్నారని, తరువాత చాలా బాగా నటించావని అభినందించారని గుర్తు చేసుకున్నారు. నటనలో శివాజీగణేశన్‌కు పోటీ ఎవరూ లేరని అన్నారు. ఇక విక్రమ్‌ప్రభు ఉన్నత స్థాయికి ఎదగాలని ఇక్కడ అందరూ ఆశీర్వదిస్తున్నారని, ఆయనకు అంతకు మించిన బరువు, బాధ్యతలు ఉన్నాయని, అవన్నీ ప్రభు చక్కగా నిర్వర్తించగలరని అన్నారు. విక్రమ్‌ప్రభు తన తాత, తండ్రుల పేరును కాపాడాలనే తపనతో ఉన్నారని కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడని అన్నారు. విశాల్ కోరికలో న్యాయం ఉంది విశాల్ మీడియా ముందుంచిన కోరికలో న్యాయం ఉందని అన్నారు. చిత్రం విడుదలైన రెండు మూడు రోజుల తరువాత విమర్శలు రాస్తే బాగుంటుందని అన్నారు. అదే విధంగా నిర్మాతలు అందరూ బాగుండాలన్న భావనతో చిత్రాలు నిర్మించాలని, తానొక్కడినే లబ్ధి పొందాలనుకోరాదని అన్నారు. పంపిణీదారులు కూడా ముందుగా బాగా ఆలోచించి, సీనియర్ల సలహాలను తీసుకుని చిత్రాలను కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, కలైపులి ఎస్. థాను, దర్శకుడు పి. వాసు, సత్యరాజ్, ధనుష్, ఆర్. పన్నీర్‌సెల్వం, అరుళ్‌పతి, లారెన్స్, నిక్కీగల్రాణి, ప్రభుసాలమన్, సాన్‌రోల్డన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నటుడు ప్రభు ధన్యవాదాలు తెలిపారు. -
నిప్పు రా..!
నిప్పు రా.. తాకరా... అంటూ ‘కబాలి’లో రజనీకాంత్ తెరపై కనిపించగానే అభిమానులు పరమానందపడిపోయారు. అచ్చంగా రజనీ స్టైల్‌కి తగ్గ పాట అది. రజనీ తనదైన స్టైల్లో నడుస్తుంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ‘కబాలి’ విడుదలై నెల రోజులు పైనే అయ్యింది. ఇప్పుడీ పాట గురించిన ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? మరేం లేదు. ‘నెరుప్పు డా’ పేరుతో రూపొందనున్న ఓ తమిళ చిత్రంలో రజనీ అతిథి పాత్ర చేయనున్నారట. నెరుప్పు డా అంటే నిప్పు రా అని అర్థం. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ తనయుడు, నటుడు ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు హీరోగా రూపొందనున్న చిత్రం ఇది. ఇందులో హీరో ఫైర్ సర్వీస్‌లో పని చేస్తుంటాడు. రజనీ అభిమాని. ఓ సన్నివేశంలో హీరోకి తన అభిమాన సూపర్ స్టార్ కనిపిస్తాడట. ఆ సీన్ రజనీ చేస్తే బాగుంటుందని చిత్రబృందం భావించింది. శివాజీ కుటుంబంతో రజనీకి మంచి అనుబంధం ఉంది. ‘జస్టిస్ గోపీనాథ్’, ‘నాన్ వాళవైప్పేన్’, ‘పడిక్కాదవన్’, ‘నరసింహా’... ఇలా నాలుగైదు చిత్రాల్లో శివాజీ కాంబినేషన్లో రజనీ నటించారు. ప్రభుతో ‘గురు శిష్యన్’, ‘చంద్రముఖి’ చిత్రాల్లో నటించారు. అదే కుటుంబానికి చెందిన విక్రమ్ ప్రభు సినిమా కాబట్టి, గెస్ట్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. నూతన దర్శకుడు బి. అశోక్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. -
దటీజ్ కబాలి!
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' విడుదలకు ముందే సృష్టిస్తోంది. ఈ సినిమాలోని 'నిరుప్పుడా' తమిళ పాట టీజర్ లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే పేరుతో ఏకంగా సినిమానే తెరకెక్కిస్తున్నారు. బి. అశోక్ కుమార్ అనే దర్శకుడు తన తొలి సినిమాకే 'నిరుప్పుడా' టైటిల్ పెట్టాడు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటించనున్నాడు. కథకు అనుగుణంగానే ఈ పేరు పెట్టినట్టు అశోక్ కుమార్ వెల్లడించారు. 'అగ్నిమాపక దళం సేవలు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రజనీ కాంత్ అంటే పడిచచ్చే ఫైర్ మ్యాన్ గా విక్రమ్ ప్రభు కనిపించనున్నాడు. బాగా ఆలోచించే నిరుప్పుడా టైటిల్ పెట్టాం. ఈ పేరే మా సినిమాకు అన్నివిధాలా సరిపోతుంద'ని అశోక్ కుమార్ తెలిపారు. 'కబాలి' సినిమా నిర్మాత కళైపులి ఎస్ థాను అంగీకారంతోనే 'నిరుప్పుడా' టైటిల్ పెట్టామన్నారు. విక్రమ్ ప్రభు సరసన నిక్కీగల్రాణి నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభంకానుంది. -
దూసుకుపోతున్న కబాలి 'నిరుప్పుడా'
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదలకు ముందే దుమ్ము రేపుతోంది. ఆ సినిమాలోని ఓ సాంగ్ టీజర్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. తమిళంలో 'నిరుప్పుడా' పాట టీజర్ విడుదల చేయటమే ఆలస్యం లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టింది. ఒక్కరోజులోనే 3,417,666 వ్యూస్ వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం ఆడియో ఎలాంటి అట్టహాసం లేకుండా విడుదల చేశారు. గతంలోనూ ఈ చిత్రం టీజర్ అత్యధిక వ్యూస్‌తో రికార్డు సృష్టించింది కూడా. కబాలి చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన విషయం తెలిసిందే. రజనీకాంత్, రాధికా ఆప్టే జంటగా నటించిన ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే తమిళంలో విడుదల కాగా త్వరలో తెలుగులో విడుదల కానున్నాయి. ఇక సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని రజనీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక టీజర్లో రజనీకాంత్ లుక్ సరికొత్తగా ఉంది. స్టైల్ అంటే రజనీ...రజనీ అంటేనే స్టైల్ అనేట్టుగా ఉంది. కాగా జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.