కాళహస్తీశ్వరగా...
కాళహస్తీశ్వరగా...
Published Tue, Dec 6 2016 3:13 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
హీరోగా వందకు పైగా సినిమాలు... ‘అభినవ కన్నడ కంఠీరవ’గా కర్ణాటక ప్రేక్షకుల కితాబులు... వెరసి తండ్రి రాజ్‌కుమార్‌కి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కన్నడ హీరో శివరాజ్ కుమార్. త్వరలో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారీయన. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో అతిథి పాత్ర చేశారాయన.
ఈ చిత్రంలో కాళహస్తీశ్వర పాత్రలో కనిపించనున్నారు. నేడు శివరాజ్ కుమార్ తల్లి పార్వతమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆ లుక్‌ని విడుదల చేశారు. ఈ నెల 16న తిరుపతిలో పాటల్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. హేమమాలిని, శ్రీయ, కబీర్‌బేడి నటించిన ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరావు.
Advertisement
Advertisement