అతిథులుగా సూర్య, జ్యోతిక | surya, Jyothika Guest role in How Old Are You movie | Sakshi
Sakshi News home page

అతిథులుగా సూర్య, జ్యోతిక

Published Thu, Jan 8 2015 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

అతిథులుగా సూర్య, జ్యోతిక

అతిథులుగా సూర్య, జ్యోతిక

నిజ జీవితంలో విడదీయరాని బంధంతో మేడ్  ఫర్ ఈచ్ అదర్‌గా పేరు తెచ్చుకుంటున్న సూర్య, జ్యోతికలు తెరపై అతిథులుగా మెరవడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఒకప్పుడు హిట్ పెయిర్‌గా వెలిగిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత సంసార జీవితానికే పరిమతమైన జ్యోతిక ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి తయారయ్యారు. మలయాళంలో మంచి విజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యూ చిత్రం తమిళ రీమేక్‌లో జ్యోతిక నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటోంది. పాండిరాజ్ దర్శకత్వంలో తన భర్త సూర్యతో కలిసి జ్యోతిక అతిథిగా మెరవడానికి సిద్ధం అవుతున్నారు.
 
 పసంగ, మెరినా వంటి బాల చిత్రాలతో విజయాలు సాధించిన పాండిరాజ్ మరోసారి బాలల ఇతివృత్తంతో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన 2డి పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన ఒక ప్రముఖ నటి అతిథిగా నటించనున్నారనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడా పాత్రను జ్యోతిక పోషించడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. జ్యోతిక హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా సూర్య మాస్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో సూర్య, జ్యోతిక పాండిరాజ్ దర్శకత్వంలో అతిథులుగా మార్చిలో నటించనున్నారని సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement