How Old Are You movie
-
ఇస్తినమ్మ వాయనం...
‘తుమ్హారీ సులూ’ సినిమా తర్వాత ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో బసవతారకం రోల్ చేస్తున్నారు విద్యా బాలన్. ఆ మధ్య ఇందిరా గాంధీ బయోపిక్‌లోనూ యాక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ అప్డేట్ ఇంకా లేదు. ఆయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారమేంటంటే తమిళంలో జ్యోతిక కమ్‌బ్యాక్ చిత్రంగా చేసిన ‘36 వయదినిలే’ హిందీ రీమేక్‌లో నటించడానికి విద్యా ఆసక్తికరంగా ఉన్నారని టాక్. ‘36 వయదినిలే’ మలయాళ చిత్రం ‘హౌ ఓల్డ్ ఆర్ యు’కు రీమేక్. లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం, సబ్జెక్ట్ నచ్చడంతో ఈ సినిమాను ఓకే చేశారట విద్యా. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనంలా ఉంది విద్యా బాలన్, జ్యోతికల పరిస్థితి. ఒక పక్క విద్యా బాలన్ ‘తుమ్హారీ సులూ’ రీమేక్ లో జ్యోతిక యాక్ట్ చేస్తుంటే, విద్యా బాలన్ ఏమో జ్యోతిక సినిమా రీమేక్ చేయాలనుకోవడం విశేషం. -
అతిథులుగా సూర్య, జ్యోతిక
నిజ జీవితంలో విడదీయరాని బంధంతో మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా పేరు తెచ్చుకుంటున్న సూర్య, జ్యోతికలు తెరపై అతిథులుగా మెరవడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఒకప్పుడు హిట్ పెయిర్‌గా వెలిగిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత సంసార జీవితానికే పరిమతమైన జ్యోతిక ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి తయారయ్యారు. మలయాళంలో మంచి విజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యూ చిత్రం తమిళ రీమేక్‌లో జ్యోతిక నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటోంది. పాండిరాజ్ దర్శకత్వంలో తన భర్త సూర్యతో కలిసి జ్యోతిక అతిథిగా మెరవడానికి సిద్ధం అవుతున్నారు. పసంగ, మెరినా వంటి బాల చిత్రాలతో విజయాలు సాధించిన పాండిరాజ్ మరోసారి బాలల ఇతివృత్తంతో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన 2డి పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన ఒక ప్రముఖ నటి అతిథిగా నటించనున్నారనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడా పాత్రను జ్యోతిక పోషించడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. జ్యోతిక హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా సూర్య మాస్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో సూర్య, జ్యోతిక పాండిరాజ్ దర్శకత్వంలో అతిథులుగా మార్చిలో నటించనున్నారని సమాచారం.