బిల్ గేట్స్ (ఫైల్ ఫొటో)
హాలీవుడ్ లో అత్యంత ప్రజాధరణ పొందిన టీవీ సీరీస్ గా గుర్తింపు తెచ్చుకున్న ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ తాజా సీరీస్‌లో ఓ ప్రముఖ వ్యక్తి అతిథి పాత్రలో నటించనున్నారు. దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ ఈషోలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆయన షోలోనూ తన నిజ జీవిత పాత్ర బిల్‌గేట్స్‌గానే కనిపించనున్నారట. కార్యక్రమంలో భాగంగా జరిగే ఓ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా కనిపించనున్నారు.
బిల్‌గేట్స్ తో పాటు ఈ షోలో స్టీఫెన్ హాకింగ్స్, స్టాన్‌లీలు కూడా అతిథులుగా కనిపించనున్నారు. ఈ కార్యక్రమం వచ్చే నెలలో ప్రసారం కానుంది. బిల్ గేట్స్ 2001లోనూ ఫ్రైసర్ అనే టీవీ షోలో నటించారు. ఇప్పటికే ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ పదకొండు సీజన్ లు పూర్తి చేసుకుంది. 12వ సీజన్ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో పలువురు ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment