
సమంత (తాజా చిత్రం)
సాక్షి, సినిమా : టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ జోడీ సమంత-నాగ చైతన్య వివాహం తర్వాత తిరిగి కలిసి నటించబోతున్నారన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ ఈ తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు దాదాపు ఖరారు కాగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. ఇందులో సమంత కేవలం అతిథి పాత్రలోనే నటించబోతోందంట. ఈ చిత్రంలో కాసేపు కనిపించే ఓ పాత్ర కోసం దర్శకుడు నటీమణుల కోసం వెతుకుతుండగా.. సామ్ పేరును చైతూ సూచించినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన్న హీరోయిన్ రోల్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. రొమాంటిక్ ట్రాక్‌తో శివ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడంట.
ప్రస్తుతం సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు చిత్రాలతో బిజీగా ఉన్న చైతూ అవి పూర్తికాగానే శివ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మరోవైపు సమంత రంగస్థలం, మహానటిలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment