గెస్ట్‌ రోల్‌ కోసం కాజల్‌ భారీ పారితోషకం | Kajal Guest Role in Rana's Haati Mere Saadi Cinema | Sakshi
Sakshi News home page

గెస్ట్‌ రోల్‌ కోసం కాజల్‌ భారీ పారితోషకం

Published Fri, Aug 7 2020 2:08 PM | Last Updated on Fri, Aug 7 2020 2:12 PM

Kajal Guest Role in Rana's Haati Mere Saadi Cinema  - Sakshi

కాజల్‌ అగర్వాల్‌ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 ఏ‍ళ్లు కావొస్తున్న ఇంకా తన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. హీరోయిన్‌  రోల్సే కాకుండా ఈ చందమామ అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో ఐటమ్‌ సాంగ్స్‌తో పాటు, గెస్ట్‌ రోల్స్ కూడా చేస్తోంది. యంగ్‌స్టార్‌లతో పాటు సీనియర్‌ యాక్టర్లతో కూడా కాజల్‌  జత కట్టింది. చాలా మంది హీరోలతో, హీరోయిన్స్‌తో, డైరెక్టర్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో అప్పుడప్పుడు వారి సినిమాల్లో గెస్ట్‌రోల్స్‌ కూడా చేయడానికి కాజల్‌ ఒప్పుకుంటుంది. అయితే చేసేది గెస్ట్‌ రోల్, కనబడేది కొద్దిసేపే అయినా కాజల్‌ మాత్రం తన పారితోషకం విషయంలో అ‍స్సలు తగ్గడం లేదు.

తాజాగా రానా నటిస్తున్న హిందీ సినిమా ‘హాథీ మేరే సాథీ’ చిత్రంలో కాజల్‌ అరగంట పాటు వుండే ఒక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.  ఇందుకోసం ఈ ముద్దుగుమ్మ 70 లక్షల పారితోషకం తీసుకున్నట్లు ఫిలిం నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో కాజల్‌ ఆదివాసి యువతిలా కనిపించనుంది. ఆదివాసీల సంప్రదాయానికి తగ్గట్టుగానే కాజల్‌  బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీరకట్టులోనే కనిపించనుందంట. రానా, కాజల్‌ కలిసి నటించిన నేనే రాజు నేను మంత్రి  సినిమా ఎంత సూపర్‌ హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో వీరిద్దరి కాంబినేషన్‌ సూపర్‌ ఉందంటూ ప్రేక్షకులు కితాబిచ్చారు. మరి కాజల్‌, రానా మరోసారి కలిసి నటిస్తున్న హాథీ మేరే సాథీ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమా తెలుగులో 'అరణ్య' తమిళంలో 'కాదన్‌' హిందీలో 'హాథీ మేరే సాథీ', గా ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: మెగాస్టార్‌ తదుపరి చిత్రం ఆ డైరెక్టర్‌తోనే !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement