ఇంపార్టెంట్ గెస్ట్!
మీకు తెలుసా? నయనతార అతిథి పాత్రలో నటిస్తున్నారు. కానీ, ఎవ్వరికీ ఈ ఖబర్ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం అందుకునే నయన ఓ సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించడం, అది కూడా ఎవ్వరికీ చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తమిళ దర్శకులు ‘‘ఏ.ఆర్.మురుగదాస్ (‘కత్తి’), పా.రంజిత్ (‘మద్రాస్’) నా కథలు చోరీ చేశా’’రంటూ వార్తల్లో నిలిచిన వివాదాస్పద రచయిత మింజుర్ గోపీ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంలోనే నయనతార అతిథి పాత్ర చేస్తున్నారు.
కథ, పాత్రను మలిచిన విధానం ఆమెకు బాగా నచ్చాయట. దళిత హక్కుల కోసం పోరాడే కలెక్టర్ పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. నయన పాత్ర నిడివి అతిథి పాత్ర కంటే కాస్త ఎక్కువ ఉంటుందట. చాలా ఇంపార్టెంట్ రోల్ అని వినికిడి. ‘కాక్కా ముట్టై’తో తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన బాలలు విఘ్నేశ్, రమేశ్‌లు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే, నయనతారపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట.