మావయ్యకు గెస్ట్‌గా..! | Allu Arjun wants to make a cameo in Chiranjeevi's next | Sakshi
Sakshi News home page

మావయ్యకు గెస్ట్‌గా..!

Published Sun, May 22 2016 10:28 PM | Last Updated on Sun, Jul 14 2019 3:40 PM

మావయ్యకు గెస్ట్‌గా..! - Sakshi

మావయ్యకు గెస్ట్‌గా..!

మెగాస్టార్ చిరంజీవి ‘కత్తిలాంటోడు’ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో

మెగాస్టార్ చిరంజీవి ‘కత్తిలాంటోడు’ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించనున్న ఈ చిత్రం ఇక సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం. ఇందులో అనుష్క కథానాయిక అనీ, క్యాథరిన్ ఐటమ్ సాంగ్ చేయనుందనీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటి సంగతెలా ఉన్నా ఈ చిత్రంలో చాన్స్ వస్తే, నటిస్తానని అల్లు అర్జున్ అంటున్నారు. ‘‘మావయ్య సినిమాలో అవకాశం రావాలే గానీ అతిథి పాత్ర అయినా చేయడానికి రెడీ’’ అని బన్నీ పేర్కొన్నారు.

అప్పట్లో ‘శంకర్‌దాదా జిందాబాద్’లో ఓ పాటలో మావయ్యతో కలిసి చిందేశారు బన్నీ. ఆ తర్వాత ఆయనతో కలిసి నటించలేదు. ఒకవేళ చిరు తాజా చిత్రంలో గెస్ట్ రోల్ ఉండి, అది బన్నీకి దక్కితే అప్పుడీ స్టైలిష్ స్టార్ దిల్ ఖుష్ అయిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement