
తమిళసినిమా : నేనిప్పుడు చాలా మారిపోయాను అంటోంది మిల్కీబ్యూటీ తమన్నా. యోగా టీచర్ అనుష్క సినీరంగప్రవేశం చేసినా, తన పూర్వవృత్తిని మరచిపోలేదు. తన యోగా సరంజామాను షూటింగ్ స్పాట్స్‌కు తీసుకెళ్లి నటుడు ఆర్య వంటి సహ నటులకు యోగాను నేర్పించేవారు. దాని ఫలితం గ్రహించిన పలువురు తారలిప్పుడు యోగా బాట పట్టారు. అందులో నటి తమన్నా ఒకరు. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ యుక్తవయసు అమ్మాయిలానే కనిపించే తమన్నా తన అందానికి యోగా ముఖ్య కారణం అంటున్నారు.
హైదరాబాద్‌లోని భరత్ ఠాకూర్ యోగా ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారట. దీని గురించి ఈ బ్యూటీ తెలుపుతూ తానెప్పుడూ చిన్నపిల్లలా ప్రవర్తించేదానినని, అయితే ఎప్పుడైతే భరత్ ఠాకూర్ యోగా ఇన్‌స్టిట్యూట్‌లో చేరానో అప్పటి నుంచి చాలా మారిపోయానని చెప్పారు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనర్ రుషి అంతగా యోగా శిక్షణను ఇచ్చారని తెలిపారు. యోగాలో శిక్షణ మాత్రమే కాకుండా శారీరకంగా, మానసికంగా ఎలా ఉత్సాహంగా ఉండాలన్న విషయాలను నేర్పించారని చెప్పారు. బాహుబలి చిత్రంలో నటిస్తుండగా ఆయనతో స్నేహం ఏర్పడిందని తెలిపారు. అప్పటి నుంచి తాను యోగాలో శిక్షణ పొందుతున్నానని చెప్పారు. నిజం చెబుతున్నా యోగాలో శిక్షణ పొందిన తరువాత తాను చాలా అదృష్టవంతురాలిననే భావన కలుగుతోందని అన్నారు. ఇప్పుడు షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా యోగా మానుకోనని తమన్నా అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా కన్నె కలైమానే చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment