
టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ‘లక్ష్మీ’ గా ఆమె అలరించనున్నారు. ఈ క్రమంలో సినిమాలో తన క్యాస్టూమ్స్ గురించి ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ బాహుబలి తర్వాత నా కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. 18 వ శతాబ్దపు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తులు ధరించాను. డిజైనర్లు సుస్మిత(చిరంజీవి కుమార్తె), అంజూ మోదీ నా కోసం ప్రత్యేకమైన లెహంగాలు రూపొందించారు. నా జీవితంలో నేను ధరించిన అత్యంత ఖరీదైన దుస్తులివే’ అంటూ తమన్నా మురిసిపోయారు.
కాగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా నరసింహారెడ్డి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను... రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment