తమన్నా బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలీవుడ్.. ఇటు సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మిల్కీ బ్యూటీగా అభిమానులను అలరించింది. తెరపై తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి తమన్నాపై డేటింగ్ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉందంటూ ఒక్కసారిగా రూమర్స్ హల్ చల్ చేశాయి. అయితే తాజాగా దీనిపై మిల్కీ బ్యూటీ స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్నా ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపిస్తాయని తెలిపింది.
తమన్నా మాట్లాడుతూ.. 'సౌత్‌లో ఎవరికైనా ఓ టైటిల్ ఉంటుంది. అందుకే మిల్కీ బ్యూటీ అని పిలుస్తారు. నా కలర్ వల్ల అలా పిలుస్తారనుకుంటా. ఒక నటిగా నేను ఫ్యాన్స్ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను. నేను కొంతమంది ఫ్యాన్స్‌తో కూడా మాట్లాడాను. కొందరు అభిమానులు నేను లవ్‌లో ఉన్నట్లు కామెంట్స్ చేస్తుంటారు. వాటిని నేను కూడా చదివా. అవీ చాలా ఫన్నీగా అనిపించాయి. ఇవన్నీ ఎవరు రాస్తున్నారు? ప్రతి ఒక్కరికీ జీవితం ఉంటుంది. నా జీవితంలో చాలా ప్రేమ పొందా. ప్రతి విషయంలో నెగెటివిటీ పెరిగిపోయింది. ' అంటూ తనపై వస్తున్న రూమర్స్‌ను సింపుల్‌గా కొట్టిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment