
మిల్కీబ్యూటీగా తన అందం, నటనతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది తమన్నా. చాలాకాలం తరువాత ‘ఎఫ్2’ రూపంలో ఓ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది తమన్నా. ఈ సినిమాతో మళ్లీ ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చేసింది తమన్నా. ఈ మూవీ హిట్ కావడంతో మరికొన్ని ప్రాజెక్ట్‌లు తమన్నాను వరించాయి.
అయితే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో విరాట్‌తో ఎఫైర్‌పై ప్రశ్నలు వేయగా.. ఆ విషయంపై మొదటిసారిగా తమన్నా స్పందించింది. తాను విరాట్ కోహ్లీతో కలిసి గతంలో ఓ యాడ్‌లో పనిచేశానని. అటు తరువాత మళ్లీ విరాట్‌ను ఇంతవరకు కలవలేదని, తనతో ఎలాంటి సంబంధం లేదని, డేటింగ్ చేయలేదని సమాధానమిచ్చారు. తమన్నా ప్రస్తుతం మహాలక్ష్మీ (క్వీన్ రీమేక్)తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment