తమన్నా పోయే....శ్రుతి వచ్చే? | Shruti Haasan to replace Tamannah in 'Aagadu'? | Sakshi
Sakshi News home page

తమన్నా పోయే....శ్రుతి వచ్చే?

Published Wed, Aug 28 2013 12:09 PM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

తమన్నా పోయే....శ్రుతి వచ్చే?

తమన్నా పోయే....శ్రుతి వచ్చే?

మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆగడు'లో తమన్నా స్థానంలో శ్రుతిహాసన్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాకు శ్రుతి హాసన్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. తమన్నా ఛాన్స్ను శ్రుతి కొట్టేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆగడు' చిత్రంలో తమన్నా స్థానంలో శ్రుతిహాసన్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనువైట్ల ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. 'ఆగడు' చిత్రానికి ముందుగా తమన్నాను కథానాయికిగా ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఆమె స్థానంలో శ్రుతిని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు దర్శకుడు శ్రీనువైట్ల సన్నిహితుడు ఐఏఎన్ఎస్కు తెలిపాడు. శ్రుతిహాసన్‌ అయితే మహేష్‌ బాబుకు సరిజోడిగా వుండటమే కాకుండా ఫ్రెష్‌నెస్‌ కూడా ఉంటుందని, భావిస్తున్నారని...  అయితే దీనిపై స్పష్టత రావటానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నట్లు అతను వెల్లడించాడు.

మరోవైపు తమన్నాకు వరుస ప్లాప్ల కారణంగా ఆమెను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. తమన్నా నటించిన నాలుగు చిత్రాలు వరుసగా పరాజయం పొందటంతో ....'గబ్బర్ సింగ్' హిట్తో గోల్డెన్ లెగ్గా శ్రుతిహాసన్ పేరు కొట్టేసింది. అలాగే ఇటీవల విడుదలైన 'బలుపు' విజయాన్ని కూడా ఆమె తన ఖాతాలో వేసుకుంది. దాంతో శ్రుతిహాసన్ వైపు దర్శక, నిర్మాతలు మొగ్గుచూపినట్లు సమాచారం. ప్రస్తుతం శ్రుతి హాసన్  'రామయ్య వస్తావయ్యా' చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తోంది.

ఇక ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత షూటింగ్ పూర్తయ్యే వరకు దూకుడే దూకుడు.. ఆగేది లేదనే టైప్‌లో  ‘ఆగడు’ను నవంబర్ నుంచి సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు శ్రీనువైట్ల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందిన ‘దూకుడు’ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే.మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.  14 రీల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement