
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను... రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సౌత్ టాప్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్నా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) తమన్నా పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మిల్కీ బ్యూటీకి బర్త్‌డే విషెస్ తెలియజేసింది.
సినిమాలో ఆమె పాత్ర పేరును లక్ష్మిగా పరిచయం చేసిన సైరా టీం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా 2019 సమ్మర్‌లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కురెడీ అవుతున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment