ఎన్టీఆర్ కోసం తమన్నా కాదు..కాజల్ | Kajal Special song in janatha garage | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ కోసం తమన్నా కాదు..కాజల్

Published Fri, Jul 29 2016 2:25 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

ఎన్టీఆర్ కోసం తమన్నా కాదు..కాజల్ - Sakshi

ఎన్టీఆర్ కోసం తమన్నా కాదు..కాజల్

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ను ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే భారీ స్టార్ కాస్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్పెషల్ సాంగ్ కోసం కూడా స్టార్ హీరోయిన్నే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇప్పటికే రెండు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన తమన్నాను ఎన్టీఆర్ సరసన ఆడిపాడేందుంకు సంప్రదించారు.

మొదట్లో ఈ సాంగ్ చేయడానికి అంగీకరించిన తమన్నా, తరువాత బాలీవుడ్ ఆఫర్స్ వస్తుండటంతో నో చెప్పేసింది. దీంతో ఆలోచనలో పడ్డ జనతా గ్యారేజ్ యూనిట్, మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్తో స్పెషల్ సాంగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారు. అసలే అవకాశాల్లేక కష్టాల్లో ఉన్న కాజల్, ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ అనగానే వెంటనే ఒప్పేసుకుంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మళయాల నటులు మోహన్ లాల్, ఉన్ని ముకుందన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement