Vijay Varma Finally Breaks Silence On Dating Rumours With Tamanna, Deets Inside - Sakshi
Sakshi News home page

Vijay Varma -Tamanna: తమన్నాతో లవ్.. ఆ సమయం కోసం వెయిట్ చేశా: విజయ్ వర్మ

Published Thu, Jun 15 2023 10:47 AM | Last Updated on Fri, Jun 16 2023 5:16 PM

Vijay Varma Finally Breaks Silence On Dating Tamannaah Bhatia - Sakshi

బాలీవుడ్‌ నటుడు విజయ్ వర్మ, మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే లస్ట్ స్టోరీస్-2 వెబ్‌ సిరీస్‌లో జంటగా నటించారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, కాజోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ చాలాసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సీక్రెట్‌గా ఉన్న బంధాన్ని మిల్కీ బ్యూటీ తాజాగా బయట పెట్టేసింది. దీంతో ఇన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించింది తమన్నా భాటియా. తాజాగా విజయ్ వర్మ సైతం తమ రిలేషన్‌షిప్‌పై స్పందించారు. 

( ఇది చదవండి: స్టార్‌ హీరోయిన్‌ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?)

ప్రస్తుతం లస్ట్ స్టోరీస్-2 ప్రమోషన్లతో బిజీగా ఉన్న విజయ్ వర్మ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో చిట్‌చాట్‌ సందర్భంగా తమన్నాతో రిలేషన్‌పై నోరు విప్పారు. తమ ప్రేమ గురించి ఇన్ని రోజులు బయటకు చెప్పకపోవడానికి గల కారణాలు వెల్లడించారు. 

విజయ్ వర్మ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ప్రజలకు నా ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాలనుకున్నా. సరైన సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి మీతో చెబుదామనుకున్నా.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే విజయ్‌తో ప్రేమలో ఉన్నానని.. లస్ట్ స్టోరీస్-2 సెట్స్‌లోనే లవ్‌లో పడినట్లు మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది. విజయ్‌ తోడుగా ఉంటే హ్యాపీగా ఉంటానని తెలిపింది.
- కె.తారక రామ కుమార్‌

( ఇది చదవండి: స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement