
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చర్రిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. బాలకృష్ణ స్వయంగా నిర్మించి, నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని సమం చేస్తూ ఈ రెండు భాగాలను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.
తాజాగా ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటిస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. శ్రీదేవి, జయప్రద లాంటి ఎంతో మంది హీరోయిన్లు ఎన్టీఆర్‌తో కలిసి నటించి హిట్ పెయిర్‌గా నిలిచారు. అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం.. జయప్రద పాత్రలో మిల్కీబ్యూటీ తమన్నా నటించనున్నట్లు వినికిడి. మరి ఈ విషయం అధికారికంగా తెలియాలంటే చిత్రబృందం ప్రకటించేవరకు ఎదురు చూడాల్సిందే. ఎన్టీఆర్ కథనాయుకుడు జనవరి 9న, ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి 24న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment