తమన్నా గుర్తుకు రాగానే మిల్కీ బ్యూటీ, సూపర్ హీరోయిన్, డ్యాన్సులు బాగా చేస్తుంది... తెలుగు ప్రేక్షకులకు నిన‍్న మొన్నటివరకు ఇవే తెలుసు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే సినిమాల వరకు తనకు తాను కొన్ని హద్దులు పెట్టుకుని, వాటిని తూచ తప‍్పకుండా పాటించింది. ఇప్పుడేమో వాటిని బ్రేక్ చేసేసింది. ఇదంతా కూడా ఓటీటీల వల్లే జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు 'లస్ట్ స్టోరీస్ 2'లోనూ అలానే రెచ్చిపోయింది.
తమన్నాకు ఏమైంది?
సినిమాల‍్లో హీరోయిన్ గా చేసినన్నీ రోజులు.. ముద్దు, రొమాంటిక్ సీన్లకు తమన్నా దూరంగా ఉంది. ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సినిమాలు, సిరీస్ లు చేసింది గానీ తనకు తాను పెట‍్టుకున్న రూల్స్ బ్రేక్ చేయలేదు. కానీ ఈ మధ్య 'జీ కర్దా' వెబ్ సిరీస్ లో మాత్రం రెచ్చిపోయింది. బూతు సీన్లు, బూతు డైలాగ్స్ తో మనం చూస్తున్నది తమన్నానేనా అనేంతలా గీత దాటేసింది. కెరీర్ లాస్ట్ స్టేజీకి వచ్చేసిందో ఏమో మరి? లేదంటే డబ్బు కోసమే ఇదంతా చేస్తుందా అని సందేహం వస్తోంది.
(ఇదీ చదవండి: ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?)
ట్రైలర్ లో ఏముంది?
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌ల్లో 'లస్ట్ స్టోరీస్' ఓ సంచలనం. శృంగారం, దానికి సంబంధించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని నేరుగా మాట్లాడేయటం అప్పట్లో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండో భాగాన్ని తీసుకొస్తున్నారు. జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. తొలి భాగాన్ని పోలినట్లే ఇందులోనూ పలు పాత్రలు ఉన్నాయి. పెళ్లి చేసుకోబోయే జంట, ఓ వివాహిత, ఓ మధ‍్య వయసు జంట, ఓ సింగిల్ అమ్మాయి, ఓ పనిమనిషి పాత్రలు ఇందులో కీలకం. ఆర్.బాల్కీ, కొంకన్ సేన్ శర్మ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్ శర్మ నాలుగు ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించారు.
విజయ్ తో తమన్నా
తమన్నా నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది. ఈ మధ్యనే బహిరంగంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ సిరీస్ షూటింగ్ టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. రియల్ కపుల్ కాస్త రీల్ పైనా రెచ్చిపోయారు. ఈ సిరీస్ లో విజయ్ పాత్రకు ఆల్రెడీ పెళ్లి అవుతుంది. అయినాసరే తమన్నా పాత్రతో రిలేషన్ పెట్టుకుంటాడు. వీళ్ల బంధం చివరకు ఏమైందనేది తెలియాలంటే సిరీస్ వచ్చేవరకు ఆగాలి. ఇదే సిరీస్ లో అగ్ని పర్వతం, టెస్ట్ డ్రైవ్ పదాలతో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్ లేదా సిరీస్ చూడాలనుకుంటే మాత్రం బీ కేర్‌ఫుల్!
(ఇదీ చదవండి: మేనేజర్ మోసం.. రష్మిక షాకింగ్ నిర్ణయం!)
Comments
Please login to add a commentAdd a comment