క్రేజీ డైరెక్టర్తో సాయిధరమ్ తేజ్
మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వరుస సక్సెస్లతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదుగుతున్నాడు. దీంతో ఓ సౌత్ స్టార్ డైరెక్టర్ దృష్టి ఈ యంగ్ హీరో మీద పడింది. డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకునే గౌతమ్ మీనన్ త్వరలో తెరకెక్కించనున్న ఓ భారీ చిత్రం కోసం సాయి ధరమ్ తేజ్ ను సంప్రదించాడట.
ఒకేసారి నాలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు వర్షన్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నాడు. తమిళ్లో శింబు, కన్నడలో పునీత్ రాజ్ కుమార్, మళయాలంలో పృథ్విరాజ్లు హీరోలుగా నటించనున్నారు. అనుష్క, తమన్నాలను హీరోయిన్లుగా ఫైనల్ చేశాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్న గౌతమ్ మీనన్, ఆ సినిమా పూర్తి కాగానే ఈ భారీ మల్టీ లింగువల్ సినిమా పనులు మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు.