తమిళంలో ధనుష్, అతని సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్‌ది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో ‘పుదుపేటై్ట (ధూల్‌పేట్), మయక్కమ్ ఎన్న (మిస్టర్ కార్తీక్)’ వంటి సినిమాలు ఈ కాంబినేషన్‌లో వచ్చాయి. తాజాగా మరో కొత్త సినిమా కోసం ఈ ఇద్దరూ కలిశారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా ‘నాన్ వరువేన్’ (నేను వస్తాను) టైటిల్‌తో ఓ గ్యాంగ్‌స్టర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా తమన్నాని అడిగితే, ప్రాజెక్ట్‌లోకి ‘నేను వస్తాను’ అంటూ ఓకే అన్నారని కోలీవుడ్ టాక్. తమన్నాతో కథాచర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. గతంలో ‘పడిక్కాదవన్’ (2009), ‘వేంగై’ (2011) చిత్రాల్లో జంటగా నటించారు ధనుష్, తమన్నా. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ జోడీగా నటించనుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment