
హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టిస్టారర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్‌లు షూటింగ్‌లో జాయిన్ కాగా, నేడు జరిగిన షూటింగ్‌లో ఇద్దరు భామలు కూడా ఎంట్రీ ఇచ్చారు.
వెంకీకి జోడిగా తమన్నా, వరుణ్‌కు జోడిగా మెహ్రీన్ నటిస్తుండగా.. వీరిద్దరు కూడా ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్ విరామ సమయంలో తమన్నాతో కలిసి దిగిన ఫోటోను మెహ్రీన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఎఫ్2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Fun begins with this beauty 😍😘 @tamannaahspeaks #F2 pic.twitter.com/aTSdZvBc9j
— Mehreen Pirzada (@Mehreenpirzada) July 10, 2018