
సమంత కాదు తమన్నా..!
ఒక్కసారి రెండు సినిమాలను రిలీజ్కు రెడీ చేసిన యంగ్ హీరో నాగచైతన్య మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం స్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతూ, ప్రేమమ్ సినిమా షూటింగ్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కూడా కాకముందే మరో సినిమాను లైన్లో పెట్టాడు.
నాగార్జున హీరోగా సొగ్గాడే చిన్నినాయానా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వలో సినిమా ప్రారంభించనున్నాడు. ముందుగా ఈ సినిమాకు హీరోయిన్గా సమంతను తీసుకోవాలని భావించినా.. ఇప్పుడు ఆ ప్లేస్లో తమన్నాను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. గతంలో చైతన్య, తమన్నాల కాంబినేషన్లో వచ్చిన 100% లవ్, తడాఖా చిత్రాలు మంచి విజయం సాధించటం ఈ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.