
‘నేను రొమాంటిక్ సన్నివేశాల్లో నటించానే కానీ ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. ముద్దు సీన్లు నా పాలసీలో, కాంట్రాక్టులో ఉండవు కూడా. అయితే ఈ నియమం మాత్రం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు వర్తించదు’ అని అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇప్పటివరకు తన సినీ ప్రయాణాన్ని, తన అభిమాన నటుల గురించి ఓ అవార్డుల వేడుకలో మీడియాతో పంచుకుంది.
హృతిక్ రోషన్‌కు తాను అతి పెద్ద అభిమానని, ఆయనలో ఉండే నిజాయతీ, నిబద్ధత నాకెంతో ఇష్టంమని తమన్నా తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం.. బాలీవుడ్‌లో కంగన నటించిన ‘క్వీన్’ సినిమాకు రీమేక్‌గా రాబోతోంది. ఈ సినిమాతో పాటు ‘సైరా నరసింహారెడ్డి’, ‘అభినేత్రి 2’, ‘కన్నే కళైమనే’, ‘ఖామోషీ’ చిత్రాలతోనూ ఆమె బిజీగా ఉన్నారు.