
‘పంతం’ సినిమాతో పలకరించిన గోపీచంద్‌కు.. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. కొంతకాలంగా సరైన విజయాలు లేక డీలా పడ్డ ఈ హీరో.. తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించాడు. సరిహద్దుల్లో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తూ చిత్రయూనిట్ బిజీగా ఉంది.
యాక్షన్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కొంతమందిని పరిశీలిస్తుండగా.. ‘ఎఫ్2’తో ఇటీవలె పెద్ద సక్సెస్‌కొట్టిన తమన్నా అయితే బాగుంటుందని మేకర్స్ ఆమెను సంప్రదించారట. తమన్నా కూడా ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. మొదటి సారిగా జోడీ కడుతున్న ఈ జంట తెరపై హిట్‌పెయిర్‌గా నిలుస్తారో లేదో వేచి చూడాలి. అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమాకి, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment