సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో రెండు చేతులా సంపాదించేస్తున్నారు మన తారలు. అయితే ఈ విషయంలో హీరోయిన్లు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వివాదాలు తావివ్వకుండా తాము ప్రచారం చేయాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఫెయిర్ నెస్ క్రీములకు ప్రచార కర్తలుగా వ్యవహరించేందుకు నో చెప్పారు.
తాజాగా ఈ లిస్ట్ లోకి ఓ యువ కథానాయిక వచ్చి చేరింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నాగచైతన్య సినిమా సవ్యసాచితో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న బ్యూటీ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చి భామ కావటంతో వెంటనే బ్రాండ్ అంబాసిడర్ గానూ ఆఫర్స్ వస్తున్నాయి. అలా వచ్చిన ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ కు ఈ బ్యూటీ నో చెప్పేసిందట. ఎంత డబ్బు ఇచ్చినా.. ఫెయిర్ నెస్ క్రీములను ప్రమోట్ చేయనని చెప్పేసిందట.
Comments
Please login to add a commentAdd a comment