
అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించారు. నాగార్జున సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు’ పాటను రీమిక్స్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఈ పాటలో నాగచైతన్యతో రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడుతుందన్న ప్రచారం జరిగింది.
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో కలిసి నటించిన చైతూ, రకుల్‌లు మరోసారి ఈ పాట కోసం ఆడి పాడనున్నారన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ వార్తపై హీరోయిన్ రకుల్ స్పందించారు. తాను సవ్యసాచి సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలు నిజంగా కాదంటూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అజయ్ దేవ్‌గన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్, కొన్ని తమిళ చిత్రాలకు కూడా ఓకె చెప్పింది.
Not true https://t.co/AahmZLpR4X
— Rakul Preet (@Rakulpreet) 15 April 2018