
నాగచైతన్య
‘సవ్యసాచి’ సినిమా రిలీజ్‌కు మూహూర్తం కుదిరిందా? అంటే.. అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఇప్పుడు వినిపిస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్ కథానాయిక. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే... ఈ సినిమాను తొలుత రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా ‘సవ్యసాచి’ చిత్రాన్ని మే 24న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ నాగచైతన్య నటించిన ‘100పర్సెంట్ లవ్’, ‘మనం’,‘తడాఖా’, ‘రారండోయ్ వేడుక చుద్దాం’ చిత్రాలు మే నెలలో రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి... నాగచైతన్యకు కలిసొచ్చిన మే మంత్‌లోనే ‘సవ్యసాచి’ చిత్రం రిలీజ్ అవుతుందా? లేక వేరే రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తారా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.