
నాగచైతన్య
‘మొహంపై గాయం, గంభీరమైన చూపు. వెనక వలయాకారంలో చేతులు. ఒక్కో చేతికి ఒక్కో ట్యాటూ. ‘చిన్నారి బొమ్మ, క్వొశ్చన్ మార్క్స్, 21, మహా, అక్క, ప్రేమ గుర్తులు’.. ఆ పచ్చబొట్లే నాగచైతన్య ఫస్ట్ పంచ్ విశేషాలు. ‘ప్రేమమ్’ వంటి హిట్ చిత్రం తర్వాత నాగచైతన్య–చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్, నవీన్ ఎర్నేని, సీవీయం మోహన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఫస్ట్ పంచ్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఫస్ట్ పంచ్ పేరుతో రిలీజ్ చేసిన నాగచైతన్య ఫస్ట్ లుక్‌కి ఇటు చిత్రవర్గాల్లో అటు అభిమానుల్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ పోస్ట్‌ర్‌తోనే చెప్పేసింది చిత్రబృందం. నాగచైతన్య లుక్ చూశాక అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాధవన్, భూమిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment